RC16: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RC16లో బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ ..!

RC 16 Update: రామ్ చరణ్ 16వ సినిమా గురించి కొత్త అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ నటుడు…కనిపించనున్నారని ఈరోజు సినిమా యూనిట్ తెలియజేసింది. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఉన్న ఈ సినిమాకి.. ఉప్పెన సినిమాతో పేరు తెచ్చుకున్న దర్శకుడు బుచ్చిబాబు సాన దక్షతత్వం వహిస్తున్నారు.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Nov 30, 2024, 06:42 PM IST
RC16: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RC16లో బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ ..!

RC 16: RRRతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించిన రామ్ చరణ్.. ఇప్పుడు తన కొత్త చిత్రం RC16 షూటింగ్‌ను మైసూర్‌లో ప్రారంభించారు. ఈ చిత్రానికి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల సమర్పణలో, వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు ఈ భారీ పాన్-ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా అన్‌కాంప్రమైజ్‌డ్ హై టెక్నికల్ వేల్యూస్‌తో.. రూపొందుతోంది.  

ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తోంది. తెలుగులో.. తన మొదటి చిత్రంగా రాబోతున్న RC16లో.. కనడ హీరో శివరాజ్ కుమార్.. ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ దివ్యేందు ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు అని సమాచారం. మున్నా భయ్యా పాత్రతో మిర్జాపూర్‌లో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న దివ్యేందు.. ఈ సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెడుతున్నారు.  

దర్శకుడు బుచ్చిబాబు, దివ్యేందు పాత్రను ఎంతో ప్రత్యేకమైనదిగా తెలియజేశారు. ఈ పాత్రకు సంబంధించిన లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు, ఇందులో దివ్యేందు రగ్డ్ లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ జగపతి బాబు కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.  

ఈ చిత్రానికి ఆర్‌.రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించనుండగా, జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా, ఏగన్ ఏకాంబరం కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేస్తున్నారు.  
 
కాగా రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా సైతం త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల కానుంది. ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. తమన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్తో వినయ విధేయ రామలో కనిపించిన.. బాలీవుడ్ భామ కియారా అద్వానీ మరలా జోడిగా కనిపించనుంది.

ఇదీ చదవండి:  Mega Family: మెగా కుటుంబంలో ఆ ఫీట్ రిపీట్ అవుతుందా.. అపుడు చిరంజీవి.. ఇపుడు నాగబాబు..

ఇదీ చదవండి: Pushpa 2 the Rule First Review: ‘పుష్ప 2 ది రూల్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లు అర్జున్ కుమ్మినట్టేనా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News