NTR-Prashanth Neel: డ్రాగన్ కోసం యానిమల్ నటులను దింపిన ప్రశాంత్.. ఇంతకీ హీరోయిన్ ఎవరంటే!

NTR Upcoming Movies: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా.. భారీ అంచనాల మధ్య ఆగస్టు 15న.. థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో.. ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా క్యాస్టింగ్ గురించిన ఆసక్తికరమైన అప్డేట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 21, 2024, 09:00 PM IST
NTR-Prashanth Neel: డ్రాగన్ కోసం యానిమల్ నటులను దింపిన ప్రశాంత్.. ఇంతకీ హీరోయిన్ ఎవరంటే!

NTR Movie Updates: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. నటిస్తున్న దేవర సినిమా త్వరలో విడుదలకి సిద్ధం అవుతుంది కొరటాల శివ.. దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ లో.. విడుదల కావాల్సింది. కానీ ఆగస్టు నుంచి పుష్ప 2.. సినిమా తప్పుకోవడంతో.. దేవర బృందం తమ సినిమాని ప్రీ పోన్.. చేసుకున్నారు. భారీ అంచనాల మధ్య..దేవర సినిమా.. ఆగస్టు 15న థియేటర్లలో విడుదల కాబోతోంది. 

ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక దేవర పార్ట్ వన్.. తర్వాత ఎన్టీఆర్ ఎలాంటి సినిమా చేయబోతున్నారు అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేజిఎఫ్ సినిమాతో కన్నడలో మాత్రమే కాక ..తెలుగు ప్రేక్షకుల దృష్టిని కూడా ఆకట్టుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాతో.. తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయిపోయాడు. 

తాజాగా ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అప్డేట్లు.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం నేషనల్ క్రష్ రష్మిక మందన్న ని సంప్రదించినట్లు తెలుస్తోంది. 

అంతేకాకుండా సినిమాలో మెయిన్ విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ను అనుకుంటున్నారట. గతేడాది విడుదలైన యానిమల్ సినిమాలో కూడా రష్మిక హీరోయిన్ గా నటించగా, బాబీ డియోల్ విలన్ గా కనిపించారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా.. నటించిన ఆ సినిమా.. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

యానిమల్ కాంబో ఎన్టీఆర్ కి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి. చాలా కాలం సినిమాలకి దూరంగా ఉన్న బాబీ డియోల్ యానిమల్ సినిమాతో మళ్ళీ వెలుగులోకి వచ్చారు. ఈసారి తెలుగు హీరోతో బాబి డియోల్ ని చూడడానికి అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇంకా డిస్కషన్లు.. మాత్రమే జరుగుతున్నాయి కానీ అధికారికంగా ఏది కన్ఫామ్ కాలేదు. ఒకవేళ ఈ కాంబో ఓకే అయితే మాత్రం క్రేజీగా ఉంటుంది అని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఎన్టీఆర్ తో కూడా రష్మిక కి ఇది మొదటి సినిమా అవుతుంది.

Read more: Viral News in Telugu: కొంపముంచిన రీల్.. 300 అడుగుల లోతైన లోయలో పడిపోయిన కారు.. షాకింగ్ వీడియో

Read more: Viral video: అట్లుంటదీ మల్ల.. నరసింహ మూవీ స్టైల్ లో పాముకు కిస్ ఇచ్చిన తాత.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News