Animal Twitter Review: యానిమల్ ట్విట్టర్ రివ్యూ.. సందీప్ రెడ్డి వంగ మరో సెన్సేషన్

Animal : తన మొదటి సినిమా అర్జున్ రెడ్డి తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఇక ఇప్పుడు తన తదుపరి సినిమా యానిమల్ తో మన ముందుకు వచ్చేశారు. మరి ఈరోజు విడుదలైన ఈ సినిమా గురించి ట్విట్టర్ లో సినీ ప్రేక్షకులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 1, 2023, 07:58 AM IST
Animal Twitter Review: యానిమల్ ట్విట్టర్ రివ్యూ.. సందీప్ రెడ్డి వంగ మరో సెన్సేషన్

Animal Review: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందాన హీరోయిన్ గా చేసిన చిత్రం యానిమల్. ఈ సినిమా టీజర్ విడుదలైన దగ్గరనుంచి ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ విడుదలైన తరువాత నుంచి ఈ చిత్రం తప్పకుండా అర్జున్ రెడ్డి సినిమాని దాటుతుంది అని నమ్మకం వ్యక్తం చేస్తూ వచ్చారు సినీ అభిమానులు. మరి నిజంగా వారి నమ్మకాన్ని సందీప్ రెడ్డి అందుకున్నారో లేదో ఒకసారి చూద్దాం..

ఈ సినిమాకి దాదాపు అన్ని పాజిటివ్ రివ్యూసే వచ్చాయి. ఎక్సలెంట్ గా ఉంది అని సందీప్ పెట్టి మళ్ళీ సెన్సేషన్ క్రియేట్ చేశారు అని అంటున్నారు నెటిజన్స్.
సందీప్ రెడ్డి వంగా మార్క్‌లోనే ఈ మూవీ ఉందని, అన్ని అంచనాలను మించేలా ఉందని పోస్టులు పెడుతున్నారు. ఇంటర్వెల్ ఫైట్ అద్భుతంగా ఉందని, మొదట 15 నిమిషాలు అస్సలు మిస్ అవ్వొద్దని.. పోస్ట్ వేశారు ఒక నేటిజన్.

మరో నేటిజన్ సినిమా పైన మరింత అంచనాలు పెంచుతూ మొదట్లోనే రష్మిక ట్విస్ట్ అంటూ ఒక ట్వీట్ వేశారు.

ఈ సినిమా రొటీన్ కథ కాదు అని.. తండ్రి కొడుకుల మధ్య అనుబంధం చాలా డిఫరెంట్ గా ఎక్సలెంట్ గా చూపించారని. మూడు గంటల 30 నిమిషాలు సినిమా చూస్తున్నాము అని ఎక్కడ అనిపివ్వదని.. బాబీ రియల్ భయంకరంగా ఉన్నారని.. రణబీర్ కపూర్ యాక్షన్ సూపర్ .. అని సినిమాని ఆకాశానికి ఎత్తేశారు..

మరొకరేమో సినిమా యాక్షన్ సూపర్.. రణబీర్ కపూర్ ఈ చిత్రానికి బ్యాక్ బోన్ .. ఎక్సలెంట్ బిజీఎం.. వెయ్యి కోట్లు పక్కా అంటూ పోస్ట్ వేశారు..

మొత్తానికి ఈ ట్విట్టర్ రివ్యూస్ చూస్తూ ఉంటే అర్జున్ రెడ్డి తరువాత మరో సెన్సేషన్ సందీప్ రెడ్డి వంగా క్రియేట్ చేసేసినట్టే అనిపిస్తోంది.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

Also Read: Belly Fat: బెల్లీ ఫ్యాట్ లేదా అధిక బరువు సమస్య వేధిస్తోందా..ఈ 3 అలవాట్లు మానండి

 

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

 

 

 

 

Trending News