Shivatmika Rajasekhar: రాజశేఖర్ కూతురు లేచిపోయిందంటూ దుష్ప్రచారం... రూమర్స్‌పై శివాత్మిక రాజశేఖర్ ఫైర్

Shivatmika Rajasekhar on Rumours: 'బాయ్‌ఫ్రెండ్‌తో లేచిపోయిన రాజశేఖర్ కూతురు..'  అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక స్పందించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 9, 2022, 04:59 PM IST
  • హీరో రాజశేఖర్ కూతురిపై దుష్ప్రచారం
  • బాయ్‌ఫ్రెండ్‌తో లేచిపోయిందని తప్పుడు ప్రచారం
  • రూమర్స్‌పై స్పందించిన శివాత్మిక రాజశేఖర్
 Shivatmika Rajasekhar: రాజశేఖర్ కూతురు లేచిపోయిందంటూ దుష్ప్రచారం... రూమర్స్‌పై శివాత్మిక రాజశేఖర్ ఫైర్

Shivatmika Rajasekhar on Rumours: 'బాయ్‌ఫ్రెండ్‌తో లేచిపోయిన రాజశేఖర్ కూతురు..' ఈ టైటిల్ చూడగానే ఎవరికైనా ఏమనిపిస్తుంది. రాజశేఖర్ కూతురు ఎవరితోనే లేచిపోయిందని భావిస్తారు. కానీ ఆ టైటిల్‌కు, ఆ వార్త లోపలి కథనానికి సంబంధం లేదు. సెన్సేషనలిజంతో రీడర్స్‌ను ఎట్రాక్ట్ చేసేందుకు ఓ సెక్షన్ మీడియా ప్రదర్శించిన అత్యుత్సాహమే తప్ప.. అందులో ఎంతమాత్రం నిజం లేదు. ఈ ప్రచారంపై తాజాగా రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక రాజశేఖర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించారు.

ఫ్యామిలీతో కలిసి ప్రస్తుతం దుబాయి టూర్‌లో ఉన్న శివాత్మిక... అక్కడ ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటో ఒకటి ఇన్‌స్టాలో షేర్ చేశారు. అదే ఫోటోకి కొన్ని కామెంట్స్‌ని జోడించారు. 'వీళ్లతో కలిసి దుబాయి వెళ్లాను. ఇప్పుడు చెప్పండి శివాని లేదా నేను లేచిపోయానని చెబుతున్న ఆ బాయ్‌ఫ్రెండ్ ఎవరు.. నెక్స్ట్ లెవల్ న్యూస్ ఇది. అయితే పారిపోయింది నేనా.. శివానినా... ప్లీజ్ బీ క్లియర్..' అంటూ శివాత్మిక తమపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు.

ప్రస్తుతం రాజశేఖర్ పెద్ద కూతురు శివాని.. హీరో రాజ్‌ తరుణ్‌తో కలిసి 'అహ నా పెళ్లంట' అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లోని ఓ సన్నివేశాన్ని ఆధారంగా చేసుకుని రాజశేఖర్ కూతురు లేచిపోయిందనే ప్రచారానికి ఓ సెక్షన్ మీడియా తెరలేపింది. ఈ వెబ్ సిరీస్‌లో రాజ్‌తరుణ్ తన డ్రీమ్ గర్ల్‌ని పెళ్లి చేసుకోవాలని తెగ ఆరాటపడిపోతుంటాడట. ఆ డ్రీమ్ గర్ల్ మరెవరో కాదు హీరోయిన్ శివాని. రాజ్‌ తరుణ్ కోరుకున్నట్లే శివానితో పెళ్లి సెట్ అవుతుంది కానీ... తీరా పెళ్లి పీటల మీద నుంచి ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి లేచిపోతుందట. ఈ విషయాన్ని చెప్పేందుకు.. బాయ్‌ఫ్రెండ్‌తో లేచిపోయిన రాజశేఖర్ కూతురు అంటూ టైటిల్స్ పెట్టి ఓ సెక్షన్ మీడియా లేనిపోని ప్రచారానికి తెరలేపింది. ఈ వ్యవహారం రాజశేఖర్ ఫ్యామిలీ దాకా వెళ్లడంతో శివాత్మిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించారు.

Also Read: Hyderabad Drugs Case: పబ్ యాజమాన్యాలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్...

Girls Cutting Hair: వారి నుంచి తప్పించుకునేందుకు.. జుట్టు కత్తిరించుకుంటున్న ఆడపిల్లలు!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News