Ram Pothineni, Boyapati Srinu : ఇస్మార్ట్ శంకర్‌తో బోయపాటి సినిమా.. టాలీవుడ్ నుంచి మరో ప్యాన్ ఇండియా మూవీ

రామ్ పొతినేని, బోయపాటు కాంబోలో తెరకెక్కనున్న ఈ సినిమాకు హీరోయిన్ కోసం ప్రస్తుతం ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో పుష్ప ఫేమ్ రష్మిక మందన పేరు సైతం ఉన్నట్టు టాక్ వినిపిస్తున్నప్పటికీ.. డేట్స్ పరంగా క్లారిటీ లేకపోవడంతోనే పేర్లను ప్రకటించలేదని సమాచారం.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 18, 2022, 08:24 PM IST
Ram Pothineni, Boyapati Srinu : ఇస్మార్ట్ శంకర్‌తో బోయపాటి సినిమా.. టాలీవుడ్ నుంచి మరో ప్యాన్ ఇండియా మూవీ

BoyapatiRapo Movie: ఇస్మార్ట్ శంకర్ మూవీతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టిన రామ్ పొతినేని ఈసారి మరింత దూకుడుతో భారీ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనుతో జత కడుతున్నాడు. అఖండ మూవీ సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్న బోయపాటి శ్రీను ఈసారి రామ్ పొతినేనితో ప్యాన్ ఇండియా సినిమాకు శ్రీకారం చుడుతున్నాడు. రామ్ పొతినేని కెరీర్లో ఇది 20వ సినిమా కాగా బోయపాటి శ్రీనుకు ఇది 10వ చిత్రం కానుంది.  

బోయపాటి శ్రీను, రామ్ పోతినేని పేర్లను కలుపుతూ బోయపాటిరాపో ( #BoyapatiRapo ) అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమాకు ఇంకా పేరు ఖరారు కాలేదు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మళయాళం భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్ కోసం ప్రస్తుతం ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో పుష్ప ఫేమ్ రష్మిక మందన పేరు సైతం ఉన్నట్టు టాక్ వినిపిస్తున్నప్పటికీ.. డేట్స్ పరంగా క్లారిటీ లేకపోవడంతోనే పేర్లను ప్రకటించలేదని సమాచారం. హీరోయిన్ ఎంపికపై ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

ట్విటర్ ద్వారా ఈ సినిమా వివరాలు వెల్లడించిన రామ్ పొతినేని.. మాస్ చిత్రాలకు డాడీ లాంటి దర్శకుడైన బోయపాటి శ్రీను కళ్లతో తనను తాను చూసుకునేందుకు చాలా ఎగ్జైంటింగ్‌గా ఉందంటూ ట్వీట్ చేశాడు. అంతేకాకుండా ఈ సినిమాను ప్రకటించడం తనకు ఎంతో కిక్కుని ఇస్తోందంటూ రామ్ పోతినేని తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. రామ్ పోతినేని లాంటి యంగ్ అండ్ ఎనర్జిక్ యాక్టర్, బోయపాటి శ్రీను (Director Boyapati Srinu) లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల దర్శకుడి కాంబోలో సినిమా అంటే ఆ హీరో అభిమానులతో పాటు బోయపాటి శ్రీను అభిమానుల్లోనూ ఎగ్జైట్‌మెంట్ ఉండటం సహజమే.

Also read : Chinna Jeeyar Swamy: సీఎం కేసీఆర్‌తో విభేదాలపై చినజీయర్ స్వామి రియాక్షన్...

Also read : Giloy Benefits: తిప్పతీగ తింటే లివర్‌ పాడవుద్దా?.. కేంద్రం ఏం చెబుతోంది?

Also read : Aloe Vera Health Benefits: అలోవెరా జ్యూస్ ఆరోగ్యానికి అంత మంచిదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News