RGV Sensational Tweet: 'నేను చావాలన్న మీ కోరిక నెరవేరాలి'.. రామ్​ గోపాల్​ వర్మ ట్వీట్!

RGV news: సంక్రాంతి సందర్భంగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్​ వర్మ తనదైన శైలిలో అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ట్వీట్​ల సారాంశమేమిటంటే..

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 14, 2022, 09:04 PM IST
  • సంక్రాంతి సందర్భంగా ఆర్​జీవీ వరుస ట్వీట్​లు
  • తన హేటర్స్​ కోరిక నెరవేరాలంటూ ఆశాభావం
  • దేవుడిపై సెటైర్ వేస్తూనే.. అందరినీ చల్లగా చూడాలని ప్రార్థన
RGV Sensational Tweet: 'నేను చావాలన్న మీ కోరిక నెరవేరాలి'.. రామ్​ గోపాల్​ వర్మ ట్వీట్!

RGV Sensational Tweet: ప్రముఖ దర్శకుడు, వివాదాలకు కేరాఫ్​ అడ్రస్ అయిన రామ్​ గోపాల్ వర్మ (ఆర్​జీవీ) మరోసారి ట్విట్టర్​లో సంచలన కామెంట్స్ (RGV sensational tweets) చేశారు. సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలులు తెలుపుతూనే ఆయన చేసిన వరుస ట్వీట్స్​ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

ఇంతకీ ట్వీట్​లలో ఏముందంటే..

నన్ను ద్వేషించే వారందరికి హ్యాపీ సంక్రాంతి. నేను త్వరగా చావాలన్న మీ కోరికను దేవుడు నెరవేర్చాలని కోరుకుంటున్నాను. అంటూ ఓ ట్వీట్ చేశారు రామ్​ గోపాల్ (RGV on his Haters) వర్మ.

ప్రతి వివాదంపై తనదైన శైలిలో స్పందించే రామ్​ గోపాల్ వర్మ.. తనపై కూడా ఇలా ట్వీట్​ చేయడం నెట్టింట వైరల్​గా మారింది.

ఈ ట్వీట్​కు ఆర్​జీవీ ఫ్యాన్స్​ భారీగా రెస్పాన్స్ అవుతున్నారు. మీరు అలా అనకండి.. మీ ఫ్యాన్స్ ఏమైపోతారు అంటూ రిప్లై ఇస్తున్నారు.

దేవుడిపై సెటైర్​..

మరో ట్విట్​లో దేవుడి సెటైర్ వేశారు ఆర్​జీవీ.

మోహం చాటేస్తూ.. ఒక వైరస్​ తర్వాత మరో వైరస్​ను పంపి మమ్మల్ని హింసిస్తున్న దేవుడా నీకు హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు అని (RGV on God) రాసుకొచ్చారు.

చిన్న సినిమాలు పెద్ద హిట్​ కొట్టాలి..

ఇంకో ట్వీట్​లో.. చిన్న సినిమాలు నిర్మిచే వారికి హ్యాపీ సంక్రాంతి.. మీ సినిమాలన్ని బాహుబలికన్నా పెద్ద హిట్​ కావాలని కోరుకుంటున్నాను అంటూ రాసుకొచ్చారు.

ఇక మరో ట్వీట్​లో ఏపీ ప్రభుత్వంపై సెటైర్​ వేశారు రామ్ (RGV comments on AP Govt) గోపాల్ వర్మ.

ఏపీ ప్రభుత్వంపై సెటైర్​..

సినిమా నిర్మాతలందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు ఎంతైతే టికెట్ ధర ఉండాలనుకుంటున్నారో దానికి ఏపీ ప్రభుత్వం అంగీకరించేలా భగవంతుడు అనుగ్రహించాలని.. ఫ్లాప్​ల కారణంగా పోగొట్టుకున్న డబ్బు కూడా తిరిగి వచ్చేలా చూస్తాడని ఆశాభావం వ్యక్తం (RGV on Small Cinema) చేశారు.

దేవుడిని నిందిస్తూనే..

ఇక చివరగా.. ఓ ట్వీట్​లో దేవుడిపై మరో సెటైర్ వేశారు ఆర్​జీవీ. అందరికీ హ్యాపీ సంక్రాంతి (Ram Gopal Varma Sankranti Wishes).. ఏ దేవుడైతే మనందరిని జబ్బుపడేలా చేస్తున్నాడో, ప్రణాలు తీస్తున్నాడో, ఆర్థికంగా నష్టపోయేలా చేస్తున్నాడో.. అదే దేవుడు మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం అందించాలని కోరుకుంటున్నట్లు (RGV satires on God) తెలిపారు.

Also read: Chaysam divorce: అయ్యో పాపం నందిని రెడ్డి.. చై-సామ్ విడాకులతో చిక్కులు!

Also read: Bangarraju Review: నాగార్జున- నాగచైతన్య బంగార్రాజు ఫైనల్ రివ్యూ.. ఎలా ఉందంటే.??

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News