Ram Charan Comments on RC16: రంగస్థలాన్ని మించి బుచ్చిబాబు RC16 ఉండబోతుంది.. హాలీవుడ్ రేంజ్ అంటున్న చెర్రీ

Ram Charan Comments on RC16: రామ్ చరణ్ తేజ్ తన 16వ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, రంగస్థలాన్ని మించి ఆ సినిమా ఉంటుందని ఆయన అంటున్నారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 19, 2023, 11:25 AM IST
Ram Charan Comments on RC16: రంగస్థలాన్ని మించి బుచ్చిబాబు RC16 ఉండబోతుంది.. హాలీవుడ్ రేంజ్ అంటున్న చెర్రీ

Ram Charan Comments on Buchibabu's RC16 Movie: రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చిన సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ టీం మొత్తంతో కలిసి పార్టీలు చేసుకున్న ఆయన అమెరికా నుంచి నేరుగా ఢిల్లీలో ల్యాండ్ అయ్యాడు, ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత తన తండ్రి చిరంజీవితో కలిసి పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిశారు. అంతకంటే ముందే ఆయన ఒక వార్తా సంస్థ నిర్వహిస్తున్న కాంక్లేవ్ లో కూడా పాల్గొన్నారు.

ఈ కాంక్లేవ్ లో పాల్గొన్న ఆయన తన 16వ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా చేస్తున్నాడు. శంకర్ అంటే సౌత్ ఇండియన్ ఆడియన్స్ కి మాత్రమే కాదు నార్త్ ఇండియన్ ఆడియన్స్ కి కూడా బాగా పరిచయం. దీంతో శంకర్ సినిమా గురించి ఈ కాంక్లేవ్ లో రామ్ చరణ్ మాట్లాడతాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఆసక్తికరంగా రామ్ చరణ్ తేజ వార్తా సంస్థ నిర్వహిస్తున్న కాంక్లేవ్ లో బుచ్చిబాబు సానాతో చేయబోతున్న తన పదహారవ సినిమా గురించి కామెంట్లు చేయడం ఆసక్తికరంగా మారింది.

తాను బుచ్చిబాబుతో చేయబోతున్న సినిమా మామూలుగా ఉండదని తన కెరీర్ లో తాను చేసిన బెస్ట్ క్యారెక్టర్లలో రంగస్థలం క్యారెక్టర్ కూడా ఒకటిగా భావిస్తానని, అంతకు మించి బుచ్చిబాబు సినిమా ఉంటుందని కామెంట్ చేశాడు రామ్ చరణ్. తన క్యారెక్టర్ రంగస్థలం సినిమాలో ఉన్న క్యారెక్టర్ కంటే పవర్ఫుల్ గా ఉంటుందని కేవలం భారతీయులను మాత్రమే కాదు వెస్ట్రన్ ఆడియన్స్ ని కూడా కనెక్ట్ చేసే విధంగా ఈ సినిమా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.

ఇక ఈ సినిమా సెప్టెంబర్ నుంచి షూటింగ్ మొదలు కాబోతోంది అని ప్రకటించడంతో శంకర్ సినిమా ఆలోపు పూర్తవుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. మొత్తం మీద రామ్ చరణ్ తేజ బుచ్చిబాబు సినిమా మీద కాకుండా బుచ్చిబాబు మీద కూడా ఒక్కసారిగా అంచనాలు పెంచే విధంగా కామెంట్లు చేయడం హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి బుచ్చిబాబు ముందుగా ఎన్టీఆర్ తో సినిమా చేయాలి అనుకున్నాడు అది ఎందుకో క్యాన్సిల్ అయ్యి చివరికి రామ్ చరణ్ వద్దకు వచ్చిందనేది ఒక ప్రచారం. అయితే ఎన్టీఆర్ తో చేయాలనుకున్న కథతోనే రామ్ చరణ్తో సినిమా చేస్తున్నాడా లేక ఇది కొత్త కథ అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు.

Also Read: Nivetha Pethuraj Saree: ఉల్లిపొర లాంటి చీరలో సెగలు రేపుతున్న నివేదా.. అందాలతోనే ధమ్కీ ఇస్తోందిగా!

Also Read; Rashmi Gautam Photos: బ్యాక్ కనిపించేలా రష్మీ గౌతమ్ హాట్ ట్రీట్.. చీరకట్టులోనూ కాక రేపుతోందిగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 

 

Trending News