Raju Gari Ammayi Naidu Gari Abbayi Movie Review: 'రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..

Raju Gari Ammayi Naidu Gari Abbayi Movie Review: అంతా కొత్త వాళ్లతో తన్విక & మోక్షిక క్రియేషన్స్ బానర్ పై తెరకెక్కిన చిత్రం 'రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి'. రాజేష్ గురజావోలు నిర్మించారు. సత్యరాజ్ కుంపట్ల దర్శకత్వం వహించిన  ఈ చిత్రం ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం.. 

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 14, 2024, 05:00 PM IST
Raju Gari Ammayi Naidu Gari Abbayi Movie Review: 'రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి'  మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..

రివ్యూ: రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి
నటీ నటులు: రవితేజ నున్న, నేహా జూరెల్, నాగినీడు, ప్రమోదిని, యోగి ఖాత్రి, జబర్దస్త్ బాబి, జబర్దస్త్ అశోక్, ఆ దూరి దుర్గ నాగ మోహన్ తదితరులు
సంగీత దర్శకుడు: రోషన్ సాలుర్
సినిమాటోగ్రాఫర్: మురళీకృష్ణ వర్మన్
ఎడిటర్ : కిషోర్ తిరుమల
బ్యానర్: తన్విక & మోక్షిక క్రియేషన్స్
నిర్మాత: రాజేష్ గొరిజవోలు
రచన, దర్శకత్వం: సత్య రాజ్ కుంపట్ల

తన్విక & మోక్షిక క్రియేషన్స్ బానర్ పై రాజేష్ గురజావోలు నిర్మించిన చిత్రం 'రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి'. క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సత్యరాజ్ కుంపట్ల డైరెక్ట్ చేశారు. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో మన మూవీ రివ్యూలో  చూద్దాం.

కథ విషయానికొస్తే..

పల్లెటూరులో జరిగే కథ. కర్ణ(రవితేజ నున్న) ఊరిలో జులాయిగా తిరిగే కుర్రాడు. ఊర్లో మంచి పేరున్న నాయుడు గారి అబ్బాయి. అదే ఊర్లో రాజు గారి అమ్మాయి అను(నేహా జురెల్). ఒకానొక సందర్భంలో అనుని చూసి కర్ణ లవ్ లో పడతాడు. ఇద్దరి మధ్య మంచి సంబంధం బలపడుతున్న సందర్భంలో అనుతో కర్ణ ఫిజికల్‌గా  దగ్గర అవ్వాలి అనుకుంటాడు. దానికి అను తిరస్కరిస్తుంది. ఈ సందర్భంగా వారిద్దరి  మధ్య గొడవ జరుగుతుంది. ఆ తర్వాతి రోజు అను శవమై కనిపిస్తుంది. ఈ మర్డర్ కేసు కర్ణ మీదకు వస్తుంది. కర్ణ తండ్రి నాగినీడు పరపతితో బయటకు వచ్చి మర్డర్  మిస్టరీని ఇన్వెస్ట్ గేట్ చేస్తాడు. అనును చంపింది ఎవరు? తన మరణానికి కర్ణ స్నేహితులకు ఏంటి సంబంధం? కర్ణ తండ్రి నాగినీడు పాత్ర ఏమిటి? ఇంతకీ అను చనిపోయిందా లేదా చివరికి ఏమైంది? అనేది తెలియాలంటే రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి సినిమా చూడాల్సిందే.

కథనం, టెక్నిషియన్స్ విషయానికొస్తే.. 
రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి గ్రామీణ నేపథ్యంలో సాగే కథ. సినిమా ఫస్టాఫ్ కర్ణ, అను మధ్య స్నేహం ప్రేమ అనే రిలేషన్స్ తో ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగుతోంది. ఎప్పుడైతే అను విగతజీవిగా కనిపిస్తుందో అససిసలైన కథ ఇక్కడే మొదలవుతుంది. దాన్ని ఎంతో గ్రిస్పీగా తెరకెక్కించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. 

ఫస్టాఫ్ మొత్తం హీరో, హీరోయిన్స్ మధ్య రొమాన్స్ చూపించిన దర్శకుడు సెకండాఫ్ మొత్తం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామాగా చూపించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అది ప్రేక్షకుల కుర్చీలోంచి కదలకుండా పకడ్బందీ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. అక్కడక్కడ లాగ్ అనిపించినా.. ఓవరాల్‌గా ఈ సినిమా కామన్ ఆడియన్స్‌కు ఆకట్టుకుంటుంది.  ఈ సందర్భంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఊహించని రహస్యాలు, మలుపులు ప్రేక్షకుడిని కట్టి పడేసేలా ఉన్నాయి. ఇలాంటి థ్రిల్లర్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం లాంటిది. ఈ సినిమాలో బీజిఎం అద్భుతంగా వర్కౌట్ అయింది. సినిమా చివరి నిమిషం వరకు ఆడియన్స్‌ను ఆలోచింపజేసేలా ఉంది. ప్రధమార్ధంలోని కొన్ని లవ్ సీన్స్ రొటీన్ గా అనిపించినా.. ద్వితీయార్థం మొత్తం అత్యంత ఉత్కంఠ భరితంగా తీర్చిదిద్దారు. యాక్షన్ థ్రిల్లర్ డ్రామాలు కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. 

సాంకేతిక అంశాలు:

ముఖ్యంగా దర్శకుడు సత్యం రాజ్ కుంపట్ల అద్భుతమైన కథతో, అత్యద్భుతమైన మలుపులతో చిత్రాన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు  ఉత్కంఠ భరితంగా తెరకెక్కించారు. థ్రిల్లర్ పాయింట్ తో చివరి వరకు ప్రేక్షకుడిని సీటు అంచున కూర్చోబెట్టిన ప్రతిభ డైరెక్టర్ ది. ఈ సినిమాతో అద్భుతమైన విజన్ ఉన్న దర్శకుడిగా మంచి భవిష్యత్తు ఉంటుంది.  సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. డిఓపి మురళీకృష్ణ వర్మన్ తన ప్రతిభతో ప్రతి ఫ్రేమ్ ను అద్భుతంగా తీర్చి దిద్దాడు. సంగీత దర్శకుడు రోషన్ సాలూరు ప్రాణం పెట్టే పని చేశారు. సినిమాకు సంగీతం వెన్నుముకగా నిలిచింది అంటే దానికి కారణం రోషన్ సాలూరి ప్రతిభ. ఎడిటింగ్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ప్రతి సన్నివేశాన్ని చాలా ఉన్నతంగా తీర్చిదిద్దారు.

నటీనటుల విషయానికొస్తే:

ఈ చిత్రంలో హీరో రవితేజ నున్న చాలా అద్భుతమైన యాక్టింగ్ చేశారు. పక్కింటి కుర్రాడులా తన నటనతో ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేశాడు. హీరోయిన్‌గా నటించిన  నేహా జురెల్ ఆకట్టుకుంది. తన నటించిన అన్ని సన్నివేశంలో ప్రేక్షకుడి చూపు తన నుంచి తిప్పుకోకుండా నటన కనబరిచింది. క్యారెక్టర్ ఆర్టిస్టులు నాగినీడు, జబర్దస్త్ బాబి, జబర్దస్త్ అశోక్, ప్రమోదిని తమ పాత్రల మేర ఆకట్టుకున్నారు.

ప్లస్ పాయింట్స్:

స్క్రీన్ ప్లే 

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 

ఇంటర్వెల్ బ్యాంగ్ 

మైనస్ పాయింట్స్ 

సినిమా నిడివి 

ఎడిటింగ్ 

ఫస్ట్ హాఫ్ రొటీన్ సీన్స్ 

లాస్ట్ పంచ్:  థ్రిల్ చేసే 'రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి'

రేటింగ్: 2.5/5

Also Read: BRS Party: బీఆర్‌ఎస్‌ పార్టీ సంచలనం.. వారిని కాదని వీరికి నాలుగు టికెట్లు కేటాయింపు మరి గెలుస్తారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News