Jailer 2: బ్లాక్ బస్టర్ సీక్వెల్ కి సిద్ధం అయిపోయిన సూపర్ స్టార్..త్వరలోనే జైలర్ 2

Rajinikanth: లాస్ట్ ఇయర్ సూపర్ స్టార్ రజినీకాంత్ కు బ్రహ్మాండమైన కమ్ బ్యాక్ అందించిన చిత్రం జైలర్. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి విడుదలైన ఈ చిత్రం 700 కోట్లకు పైగా రాబట్టింది. భారీ సక్సెస్ అయిన ఈ మూవీ సీక్వెల్ కూడా త్వరలోనే రాబోతున్నట్లు టాక్. మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 22, 2024, 09:15 AM IST
Jailer 2: బ్లాక్ బస్టర్ సీక్వెల్ కి సిద్ధం అయిపోయిన సూపర్ స్టార్..త్వరలోనే జైలర్ 2

Rajinikanth Jailer Sequel: 2023లో సైలెంట్ గా వచ్చి వైలెంట్ రికార్డు సృష్టించిన చిత్రం జైలర్. సూపర్ స్టార్ రజినీకాంత్ రేంజ్ కలెక్షన్స్ రబట్టిన ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ సాధించింది. తమిళనాడులో దాదాపు అప్పటివరకు ఉన్న అన్ని కలెక్షన్ రికార్డులను జైలర్ బద్దలు కొట్టేసింది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఇటు తెలుగులో కూడా ఈ చిత్రాన్ని ఆదరించిన వారి సంఖ్య ఎక్కువే. ప్రస్తుతం ఒక్క సినిమా హిట్ అయితే చాలు వెంటనే దాన్ని సీక్వెల్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో జైలర్ కూడా సీక్వెల్ వుంటే బాగుంటుంది అని ఆశిస్తున్నారు రజిని అభిమానులు.

వారి కోరికను తీర్చే పనిలోనే జైలర్ మూవీ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఉన్నారని టాక్. జైలర్ 2 మూవీకి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ ని కూడా నెల్సన్ రెడీ చేశారట. జైలర్ తర్వాత ఇప్పటివరకు మరొక సినిమాకి కమిట్మెంట్ ఇవ్వని నెల్సన్.. తన పూర్తి ఫోకస్ ఈ మూవీ సీక్వెల్ పైనే ఉంచారు అని సమాచారం. సినిమాకి ఉన్న క్రేజ్ దృశ్య.. నిర్మాణ సంస్థ.. సన్ పిక్చర్స్ కూడా సీక్వెల్ కి సై అంటుంది. అయితే ఎటోచి చిక్కు రజనీ కాంత్ బిజీ షెడ్యూల్ తోనే వస్తుంది.

సీక్వెల్ చేయడానికి రజిని రెడీగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆయన డేట్స్ అందుబాటులో లేవు. జైలర్ సక్సెస్ తరువాత రజిని క్రేజీ ప్రాజెక్ట్స్ తో బాగా బిజీ అయిపోయారు. రీసెంట్ గా అతని కూతురు దర్శకత్వంలో తెరకెక్కిన లాల్ సలాం మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్నారు రజిని. ఈ మూవీలో ముంబై డాన్ గా రజిని కనిపిస్తారు. ప్రస్తుతం వేటగన్ అనే మూవీ షూటింగ్ లో రజిని బిజీగా ఉన్నారు. ఈ మూవీ పూర్తి అయిన తర్వాత లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో రజిని మరొక మూవీ  నటించాల్సి ఉంది. ఇక ఆ చిత్రం పూర్తి అయిన తర్వాతే జైలర్ సీక్వెల్ కి రజిని ఫ్రీగా ఉంటారు.

మరి నెల్సన్ అంతవరకు ఆగుతాడా లేక ఈలోపు మరి ఇంకేదైనా సినిమా చేస్తాడా తెలియదు. ఏది ఏమైనప్పటికీ వీళ్లిద్దరి కాంబోలో జైలర్-2 రావడం మాత్రం కన్ఫామ్ అని టాక్. త్వరలో ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ అధికారికంగా కూడా ప్రకటిస్తున్నారని సమాచారం. జైలర్ మూవీలో రజనీకాంత్ కు ఎలివేషన్ మోత మోగించాడు నెల్సన్. ఇందులో అనిరుధ్ రవిచందర్ సిచువేషన్ కి తగ్గట్టు సెట్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా హీట్ అయింది. దీంతో రాబోయే సీక్వెల్ పై అంచనాలు భారీగా ఉన్నాయి.

Also Read: Suryavanshi Thakur: ఐదు వందల ఏళ్ల తర్వాత నెరవేరిన శపథం.. పట్టువదలని సూర్యవంశి ఠాకూర్‌ వంశీయులు

Also Read: APCC Chief YS Sharmila: తొలి రోజే స్వరాష్ట్రం ఏపీలో వైఎస్‌ షర్మిలకు ఘోర అవమానం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News