Puri to direct Pawan Kalyan: పూరి జగన్నాథ్‌తో పవన్ సినిమా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో ( Vakeel Saab ) బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. పవన్ కళ్యాణ్ మరో మూడు సినిమాలకు సైన్ చేశారు. తాజాగా పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ ( Puri Jagannadh to direct Pawan Kalyan ) కలిసి సినిమా చేయబోతున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

Last Updated : Oct 2, 2020, 12:29 AM IST
Puri to direct Pawan Kalyan: పూరి జగన్నాథ్‌తో పవన్ సినిమా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో ( Vakeel Saab ) బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. పవన్ కళ్యాణ్ మరో మూడు సినిమాలకు సైన్ చేశారు. ఈ సినిమాలకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లు పవన్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ మూవీ కాకుండా మరో మూడు సినిమాల సంగతి అలా ఉండగానే తాజాగా పవన్ ఖాతాలో మరో సినిమా వచ్చి చేరినట్టు ఫిలిం నగర్ టాక్. 

తాజాగా పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ ( Puri Jagannadh to direct Pawan Kalyan ) కలిసి సినిమా చేయబోతున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాని బండ్ల గణేష్ ( Bandla Ganesh ) ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ బద్రీ, కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమాల్లో నటించారు. Also read : Nithin in Check : నితిన్ కొత్త సినిమా టైటిల్ పోస్టర్

బద్రీ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది, కానీ కెమెరామెన్ గంగతో రాంబాబు మూవీ సినీ ప్రేమికులను అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం చెప్పుకుంటున్న ఈ సినిమా ఓకే అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది మూడవ సినిమా అవుతుంది. ఇటీవల పూరి జగన్నాథ్ వెళ్లి పవన్ కళ్యాణ్‌ని కలిసి తన వద్ద స్క్రిప్టు స్టోరీ లైన్ వినిపించాడని, ఈ ప్రాజెక్ట్ గురించి చర్చించాడని వార్తలు వస్తున్నాయి. Also read : Allu studios inauguration: అల్లు అర్జున్ ఫ్యామిలీ నుండి.. అల్లు స్టూడియో నిర్మాణం

ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో, విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda ) హీరోగా యాక్షన్ డ్రామా 'ఫైటర్' సినిమా ( Fighter movie ) తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే ( Ananya Pandey ) నటిస్తోంది. అలాగే పూరి జగన్నాథ్ 'రొమాంటిక్' అనే సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమాలో పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి ( Akash Puri ) హీరోగా నటిస్తున్నాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News