Prabhas: బాహుబలి తర్వాత హిందీ గడ్డపై ప్రభాస్ కల్కి మరో రికార్డు.. బాలీవుడ్ బాక్సాఫీస్ పై రెబల్ స్టార్ చెడుగుడు..

Kalki 2898 AD Hindi Collections: ప్రభాస్ ప్రస్తుతం తెలుగు హీరో కాదు.. భారతీయ కథానాయకుడు. ఈయన సినిమాలంటే  దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. తాజాగా హిందీ గడ్డపై ప్రభాస్ మరో రికార్డు క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అది కూడా బాహుబలి 2 సినిమా తర్వాత.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 7, 2024, 09:53 AM IST
Prabhas: బాహుబలి తర్వాత హిందీ గడ్డపై ప్రభాస్ కల్కి మరో రికార్డు.. బాలీవుడ్ బాక్సాఫీస్ పై రెబల్ స్టార్ చెడుగుడు..

Kalki 2898 AD Hindi Collections: ‘కల్కి’ మూవీ ప్రభంజనం రెండో వారంలో కూడా ఎక్కడా తగ్గడం లేదు. ముఖ్యంగా నార్త్ హిందీ బెల్ట్ లో ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులను క్రియేట్ చేసింది. 2024లో విడుదలైన హిందీ చిత్రాల్లో హైయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక మన దేశంలో కూడా 2024లో  ఎక్కువ వసూల్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికే వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా నిన్నటితో రూ. 865 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక హిందీలో కూడా ఈ సినిమా 10 రోజుల్లో ఈ సినిమా దాదాపు రూ. 190 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను సాధించింది. ఆదివారం ఈ సినిమా బుకింగ్స్ జోరు చూస్తుంటే.. ఈజీగా ఈ రోజు రూ. 20 కోట్ల నెట్ వసూళ్లు ఈజీగా క్రాస్ చేసే అవకాశాలున్నాయి.

మొత్తంగా ఈ రోజుతో ‘కల్కి 2898ఏడి’ సినిమా రూ. 200 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలవనుంది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన రెండో చిత్రం రూ. 200 కోట్లు నెట్ ఇండియన్ బాక్సాఫీస్ వసూళ్లను రాబట్టడం మాములు విషయం కాదు. తెలుగు సహా సౌత్ లో మరె హీరో సినిమా రెండోసారి రూ. 200 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టలేదు.  సౌత్ సినిమాల్లో బాహుబలి 2, కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ సినిమాలు హిందీ బాక్సాఫీస్ దగ్గర రూ. 200 కోట్లకు పైగా నెట్ వసూళ్లను హిందీ వెర్షన్ లో  రాబట్టాయి. ఇక బాహుబలి 2 ఏకంగా రూ. 500 కోట్ల నెట్ వసూళ్లను సాధిస్తే.. కేజీఎఫ్ 2 దాదాపు రూ. 430 కోట్ల నెట్ వసూళ్లు రాబడితే.. ఆర్ఆర్ఆర్ సినిమా కేవలం హిందీలో రూ. 245 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది.

రూ. 100 కోట్లకు పైగా నెట్ వసూళ్లను  సాధించిన ఆరో సినిమాగా ‘కల్కి 2898 ఏడి’ మూవీ  నిలిచింది. బాహుబలి 2 తర్వాత రూ. 200  కోట్ల నెట్ వసూళ్లను సాధించిన చిత్రంగా సరికొత్త బెంచ్  మార్క్ క్రియేట్ చేసింది. మరి ఈ సినిమా రాబోయే రోజుల్లో రూ. 300 కోట్ల నెట్ వసూళ్లను క్రాస్ చేస్తుందా లేదా అనేది చూడాలి.

Read more: Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News