Prabhas Birthday Special:ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే ఏ మాత్రం మొహమాటం లేకుండా అందరూ చెప్పే మాట ప్రభాస్. రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన ఈశ్వర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. అయితే ప్రభాస్ ఏ ఏ సినిమాలు చేశాడు? ఎంత క్రేజ్ సంపాదించాడు అనే విషయాలు దాదాపుగా అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన ఒక ఇంటర్నేషనల్ ఫిగర్.. అయితే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి మీకు తెలియని, లేకపోతే తెలిసినా పెద్దగా గుర్తు లేని విషయాలను మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాం.
Unknown Facts about Prabhas: ప్రభాస్ కృష్ణంరాజు సోదరుడు సూర్యనారాయణ రాజు, శివకుమారి దంపతులకు జన్మించారు. ప్రభాస్ పూర్తి పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి, సూర్యనారాయణ రాజు దంపతులకు మొత్తం ముగ్గురు పిల్లలు కాగా మొదటి సంతానంగా ప్రభోధ్ జన్మించారు. ఆ తర్వాత ప్రభాస్ కి ఒక సోదరి కూడా ఉన్నారు ఆవిడ పేరు ప్రగతి, అయితే ఈ ముగ్గురిలో ప్రభాస్ చిన్నవాడు. భీమవరంలో డిఎన్ఆర్ స్కూల్లో స్కూలింగ్ పూర్తి చేసిన ప్రభాస్ శ్రీ చైతన్య కాలేజ్ హైదరాబాద్ నుంచి బీటెక్ పట్టా అందుకున్నారు.
తన కెరీర్ లో వర్షం సినిమాతో హిట్ అందుకోవడం మొదలుపెట్టిన ప్రభాస్ ఆ తర్వాత చాలా హిట్ సినిమాల్లో భాగమయ్యారు. అయితే ఒక రకంగా మంచి హిట్స్ లో ఉండగా రాజమౌళి చెప్పిన బాహుబలి కథ విని దాదాపుగా ఆ కథ కోసం రెండు మూడు ఏళ్లు వెచ్చించారు ప్రభాస్. అలా సుమారు 600 రోజులు బాహుబలి షూటింగ్లో పాల్గొన్నారు. ఆ తర్వాత సీక్వెల్ కోసం మరో రెండేళ్లు వెచ్చించడంతో ఇలా తన కెరియర్లో దాదాపు ఐదేళ్లు కేవలం బాహుబలి కోసమే వెచ్చించారు.
ప్రభాస్ ఒక బాలీవుడ్ సినిమాలో అతిథి పాత్రలో కూడా కనిపించిన విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ప్రభాస్ వ్యాక్స్ స్టాట్యూ థాయిలాండ్ లోని మేడం టుస్సాడ్స్ వ్యాక్స్ స్టాట్యూ మ్యూజియంలో ఉంది, ఆ ఘనత సాధించిన మొట్టమొదటి సౌత్ ఇండియన్ యాక్టర్ గా ప్రభాస్ నిలిచారు. ఇక సాధారణంగా సినీ పరిశ్రమలో ఉన్న వారి కుటుంబ సభ్యులందరూ సినీ పరిశ్రమలోనే ఏదో ఒక విభాగంలో పనిచేయాలని అనుకుంటూ ఉంటారు కానీ ప్రభాస్ మాత్రం ముందు హీరో అవ్వాలి అనుకోలేదట.
ఆయన క్యాటరింగ్ రంగంలో ఎంట్రీ ఇచ్చి ఒక మంచి హోటల్ కూడా నిర్వహించాలని భావించాడట. సాధారణంగానే భోజన ప్రియుడు అయిన ప్రభాస్ చికెన్, చికెన్ బిర్యాని అంటే అమితంగా ఇష్టపడతాడట. రాజమౌళి కాకుండా బాలీవుడ్ లో ఆయనకు నచ్చిన డైరెక్టర్ ఎవరు అంటే రాజ్‌కుమార్ హిరాణి. ప్రభాస్ ఆయన చేసిన మున్నాభాయ్ ఎంబీబీఎస్, 3 ఇడియట్ లాంటి సినిమాలు 20 సార్లకు పైగా చూశారట. ఇక ప్రభాస్ హీరో అయ్యాక 20 ఏళ్ల వ్యవధిలో 215 కోట్ల రూపాయలు సంపాదించారు, ఇక ఒక ఏడాదికి ప్రభాస్ సుమారు 50 నుంచి 60 కోట్ల దాకా సంపాదిస్తారట.
Prabhas Upcoming Movies: ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే చివరిగా రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టారు. అందులో నాగాశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే, ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ వంటి సినిమాలు ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఇక అనౌన్స్ చేయకుండానే మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ ఒక సినిమా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Also Read: Balakrishna for Allu Sirish: అల్లు హీరో కోసం బాలయ్య.. అరవింద్ పిలుపుకు గ్రీన్ సిగ్నల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook