Pawan Kalyan Daughter Aadya Video Viral: కొద్దిరోజుల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత హోదాలో తాడేపల్లి నుంచి ఇప్పటం అనే గ్రామానికి హల్చల్ చేస్తూ వెళ్లి ఒకసారి గా హాట్ టాపిక్ గా మారారు. ఇప్పటం అనే గ్రామంలో ప్రభుత్వం రోడ్డు విస్తరణ పనులు నెపంతో జనసేన మద్దతుదారుల ఇళ్లు కూలగొడుతుందని ఆరోపిస్తూ పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తూ కారు మీద కూర్చుని ప్రయాణిస్తూ వెళ్లారు.
ఈ విషయం మీద పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయలేదు కానీ ఆ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి కంప్లైంట్ చేయడంతో ఇప్పటికే పవన్ మీద రాష్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి. అలాగే పలు సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు. ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడు, ఒక రాజకీయ పార్టీ అధినేత ఇలా కారు మీద కూర్చుని ప్రయాణిస్తూ అతివేగంతో వెళుతూ ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు అంటూ పలువురు నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.
అయితే ఆ విషయం మరుగున పడకుండానే ఇప్పుడు ఆయన కూతురు ఆద్య కూడా చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ కు రేణు దేశాయ్ తో అకిరా నందన్, ఆధ్యా అనే ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. అకిరా నందన్ ఇప్పటికే నటన శిక్షణ తీసుకుంటున్నాడు అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆద్య మాత్రం ఇంకా చదువుకుంటోంది.
ప్రస్తుతానికి తన తల్లి రేణు దేశాయ్ దగ్గరే పెరుగుతున్న ఆధ్యాకీ రానందన్, ఆద్య కావాలనుకున్నప్పుడు తన తండ్రి దగ్గరికి కూడా వెళ్లి వస్తూ ఉంటారు. అయితే తాజాగా రేణు దేశాయ్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అదేమిటంటే ఆధ్యా, రేణు దేశాయ్ కార్ సన్రూఫ్ ఓపెన్ చేసుకుని కారు మంచి స్పీడ్ లో ఉండగా నిలబడి ఆస్వాదిస్తున్నట్లుగా ఉన్న వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో మీద కొందరు పాజిటివ్గా కామెంట్ చేస్తుంటే మరికొందరు మాత్రం తండ్రిని ఫాలో అవుతూ ఇలా రోడ్డు ఎక్కావా అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే ఇలా చేయడం చట్టరీత్యా నేరమని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరి మీ ఉద్దేశం ఏమిటో కింద కామెంట్ చేయండి.
Also Read: Allu Arjun Fans Blunder : పప్పులో కాలేసిన అల్లు అర్జున్ ఫాన్స్.. ఆ లాజిక్ ఎలా మిస్సయ్యారు భయ్యా?
Also Read: Anusha Shetty: ఎన్టీఆర్ తల్లికి, నాగశౌర్య కాబోయే భార్య అనూషకు రిలేషన్ ఏంటో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook