Mr Celebrity Teaser: సుదర్శన్ పరుచూరి హీరోగా చందిన రవి కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మిస్టర్ సెలబ్రిటీ. ఆర్‌పి సినిమాస్ బ్యానర్‌పై ఎన్.పాండురంగారావు, చిన్నరెడ్డయ్య సంయుక్తంగా నిర్మించారు. వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్ నిర్వహించారు. రూమర్లు, పుకార్లను బేస్ ఈ మూవీని తెరకెక్కించినట్లు టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలను మేళవించి తెరకెక్కించినట్లు తెలుస్తోంది. టీజర్ లాంచ్ సందర్భంగా పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. తాను, తన తమ్ముడు కలిసి ఈ సినిమాను చూశామన్నారు. తన తమ్ముడు చాలా మంచి విమర్శకుడని.. సుదర్శన్ బాగున్నాడని, సినిమా బాగుందని మెచ్చుకున్నారని చెప్పారు. హీరోల కొడుకులు హీరోలుగా ఎంట్రీ అవుతుంటారని కానీ.. తమ మనవడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారని అన్నారు. సెలబ్రిటీలపై బయట వచ్చే రూమర్లను ఆధారంగా సినిమాను చక్కగా తెరకెక్కించారని డైరెక్టర్ రవి కిషోర్‌ను అభినందించారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు.
హీరో పరుచూరి సుదర్శన్ మాట్లాడుతూ.. మిస్టర్ సెలబ్రిటీతో ఇండస్ట్రీలోకి పరిచయం అవుతుండటం ఆనందంగా ఉందన్నాడు. తాను హీరో అవుతానని చెప్పగా.. తాత గారు కొన్ని పరీక్షలు పెట్టారని చెప్పాడు. ఎవరికీ చెప్పకుండా జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేశానన్నాడు. ఈ కథ గురించి తాత గారికి చెప్పగా.. ఒళ్లు దగ్గర పెట్టుకుని నటించని చెప్పారని తెలిపాడు. ప్రేక్షకులు తమ సినిమాను చూసి ఆదరించాలని కోరాడు.
దర్శకుడు రవి కిషోర్ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని.. ఓ ప్రయోగాత్మక కథ అని తెలిపారు. సుదర్శన్‌కు కథ చెప్పగా చాలా బాగుందనగా.. పరుచూరి గారు చిన్న చిన్న కరెక్షన్స్ చేశారని అన్నారు. సాధారణ వ్యక్తి నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్యను సినిమాలో చూపించానని చెప్పారు. క్లైమాక్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందన్నారు. తప్పకుండా అందరికీ నచ్చుతుందన్నారు. నటుడు రఘుబాబు మాట్లాడుతూ.. ఈ సినిమాలో సుదర్శన్ అద్భుతంగా నటించాడని మెచ్చుకున్నారు. సినిమా చాలా బాగా వచ్చిందని.. అందరూ చూడాలని కోరారు.
==> సాంకేతిక వర్గం
==> బ్యానర్ - RP సినిమాస్
==> ప్రొడ్యూసర్ -చిన్న రెడ్డయ్య, ఎన్.పాండురంగారావు
==> రైటర్, డైరెక్టర్- చందిన రవి కిషోర్
==> కెమెరామెన్ - శివ కుమార్ దేవరకొండ
==> మ్యూజిక్- వినోద్ యజమాన్య
==> సాంగ్స్- గణేష్, రాంబాబు గోసాల
==> ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వెంకట్ రెడ్డి
==> ఎడిటర్ - శివ శర్వాణి
==> PRO- సాయి సతీష్
Also Read: Chandrababu 3rd Day: పాములు, తేళ్లతో జీవిస్తున్న వరద బాధితులపై సీఎం చంద్రబాబు భావోద్వేగం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.