Samantha: సమంత రూత్ ప్రభు నుంచి సమంత అక్కినేనిగా..తిరిగి సమంతగా మారిన టాలీవుడ్ టు హాలీవుడ్ నటి క్రేజ్ ఎంతగా చెప్పుకున్నా తక్కువే. అద్బుతమైన అభిప్రాయాలు ఆమె సొంతం. ఎవరి జీవితమూ పెర్‌ఫెక్ట్ కాదంటున్న సమంత చేసిన ఆసక్తికర వ్యాఖ్యల గురించి తెలుసుకుందాం.
దక్షిణాది అగ్రనటి సమంత పుష్ప సినిమాలో(Pushpa Movie) ఐటెమ్ సాంగ్‌తో రేపిన దుమ్ము ఇంకా రేగుతూనే ఉంది. ఫ్యామిలీ మ్యాన్ 2 హిందీ వెబ్ సిరీస్‌లో లభించిన ప్రాచుర్యం కంటే ఈ ఒక్కపాటలో ఉత్తరాది అభిమానులకు చేరువైపోయింది. ఇంకా చెప్పాలంటే విడాకుల అనంతరం సమంత క్రేజ్ బాగా పెరిగింది. వివిధ ఇంటర్వ్యూల్లో ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తి కల్గించేవిగా ఉంటున్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎత్తుపల్లాలుంటాయని..తాను కూడా మానసికంగా చాలా సమస్యల్ని ఎదుర్కొన్నానని సమంత తెలిపింది. ఏ ఒక్కరి జీవితం పెర్ఫెక్ఠ్ కాదని చెబుతోంది. జీవితంలో ఎదుర్కొన్న మానసిక సంఘర్షణల్నించి స్నేహితులు, కౌన్సిలర్లు, శ్రేయోభిలాషుల సలహా, సూచనలతో బయటకు రాగలిగానని అంటోంది సమంత (Samantha). భవిష్యత్‌లో తన జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని ఎదుర్కొనేందుకు తాను స్ట్రాంగ్‌గా ఉన్నానంటోంది. సమస్య వచ్చినప్పుడు ఇబ్బంది పడే కంటే..ఇతరులతో పంచుకోవడం మంచిదంటోంది సమంత.
ఒత్తిడితో నిండుకున్న ప్రపంచంలో ఉంటున్నందున..ఫోకస్ ఎక్కువగా ఉంటుందని గ్రహించాలంటోంది. తాను మానసికంగా కొన్ని సమస్యల్నించి బయటపడేందుకు కొందరు సహాయం చేశారని చెప్పింది. ఇతరుల దృష్టి ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని అంశాలు ఆందోళనకు గురి చేస్తాయి. అదే సమయంలో బలహీనతలు, బాధలపై మాట్లాడటం ఇబ్బందిగానే ఉంటుంది. ఎవరి జీవితమూ పెర్‌ఫెక్ట్‌గా లేదని అంటోంది.
Also read: Shanvi Srivastava Photos: బీచ్ లో బికినీతో హల్ చల్ చేస్తున్న 'లవ్ లీ' భామ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook