Nikhil Siddhartha Divorce: డైవోర్స్ పై పెదవి విప్పిన నిఖిల్ సిద్దార్థ్.. అసలు విషయం ఇదట!

Nikhil Siddhartha Divorce Rumors: నిఖిల్ సిద్దార్ట్ తన భార్య పల్లవి వర్మ నుంచి విడాకులు తీసుకోబోతున్నాడు అంటూ గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగగా ఇప్పుడు దానిపై ఆయన స్పందించారు. ఆ వివరాలు   

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 19, 2022, 03:43 PM IST
Nikhil Siddhartha Divorce: డైవోర్స్ పై పెదవి విప్పిన నిఖిల్ సిద్దార్థ్.. అసలు విషయం ఇదట!

Nikhil Siddhartha Responds to Divorce Rumors: యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గతంలో కరోనా సమయంలో తాను ప్రేమించిన పల్లవి వర్మ అనే డాక్టర్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా నిఖిల్ విడాకులు తీసుకోబోతున్నాడు అంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు పుట్టుకొచ్చాయి. తాజాగా 18 పేజెస్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్న నిఖిల్ ఈ విషయం మీద స్పందించారు.

తాను డైవర్స్ తీసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలు చూసి ఆశ్చర్యపోయారని ఈ సందర్భంగా నిఖిల్ పేర్కొన్నారు. ఆ వార్తలు చూసి స్టుపిడ్ గా అనిపించిందని వాటిని చూసి నవ్వుకున్నానని ఆయన పేర్కొన్నారు. తాను తన భార్య పల్లవి వర్మ చాలా హ్యాపీగా ఉన్నామని ఇలా విడాకులు తీసుకుంటున్నామని వార్తలు వస్తున్నాయని తన భార్యతో చెప్పగా ఆమె రియాక్షన్ మాత్రం తనకి షాక్ ఇచ్చిందని అన్నారు.

మనం కలిసే ఉన్నాము అని వాళ్ళందరికీ చెక్ పెట్టే విధంగా కలిసి ఒక ఫోటో పెడదామా అని అడిగితే డ్యూడ్ ఏం చెప్తున్నావు? మనం ఎలా ఉన్నావో మనకు తెలియదా, వాటికి ఎందుకు రియాక్ట్ అవ్వాలి అని తనకే ఎదురు చెప్పిందని అది తనకు ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. ఇలాంటి రూమర్స్ చాలా ఫన్నీగా ఉంటాయని నిఖిల్ అభిప్రాయపడ్డారు. వాస్తవానికి ట్రోల్స్ మీమ్స్ చూసి తాను కూడా చాలా ఎంజాయ్ చేస్తానని ఫన్నీగా తీసుకుంటానని అన్నారు.

ఇక ఇలాంటి వార్తలు రాసే సమయంలో మీడియా వాళ్ళు కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని ఇలాంటి వార్తలు తమ దృష్టికి వచ్చినప్పుడు కాస్త రియాలిటీ చెక్ చేసుకుని ఉంటే బాగుంటుందని లేకపోతే అనవసరమైన న్యూసెన్స్ క్రియేట్ అయినట్లు అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా మీమర్స్ విషయంలో వాళ్ల మీద ప్రశంసల వర్షం కురిపించిన నిఖిల్ యూట్యూబ్ వీడియోలు మీద మాత్రం ఘాటుగా స్పందించారు.

వీడియో ఒకటి ఉంటే దాని థంబ్ నైల్ మరో రకంగా పెడుతున్నారని అసలు లోపలికి వెళితే అందులో కంటెంట్ ఉండడం లేదని ఆయన అన్నారు. ఆ వీడియోలు కూడా చాలా దారుణంగా ఉంటున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై ఎవరైనా యాక్షన్ తీసుకోవాలని లేదా యూట్యూబ్ కు సెన్సార్ అయినా ఉండాలని చెప్పుకొచ్చారు. ఇక తన భార్య తనకు చాలా సపోర్టుగా ఉంటుందని తన సినిమాల రివ్యూలు కూడా ఇస్తుందని అన్నారు.

టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని ముందే ఆమెకే పంపిస్తానని వాటికి ఆమె నచ్చిన అభిప్రాయం చెబుతుందని అన్నారు. ఇక ప్రతిరోజు షూటింగ్ అయిన తర్వాత విశేషాలు అన్నీ తన భార్యతోనే చర్చిస్తానని ఈ సందర్భంగా నిఖిల్ చెప్పుకొచ్చారు. ఇక నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన 18 పేజెస్ సినిమా డిసెంబర్ 23వ తేదీన ఘనంగా విడుదలవుతోంది. సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ల మీద సంయుక్తంగా తెరకెక్కిన ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడిగా వ్యవహరించారు.

Also Read: Samantha Ruth Prabhu : సమంత ఇక సినిమాలకు పూర్తిగా దూరం అవుతుందా?.. ఆ ఒక్కటి మాత్రం పూర్తి చేసేస్తుందట!

Also Read: PMGKAY: రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. ఆ పథకం గడువు మళ్లీ పెంపు..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 
 

Trending News