Nayanathara: నెట్ ఫ్లిక్స్ లో నయనతార-విగ్నేష్ ల పెళ్లి వీడియో.. గెట్ రెడీ!

Nayanathara vignesh shivan marriage: నెట్ ఫ్లిక్స్ సంస్థ నుంచి ఒక అధికారిక ప్రకటన వెలువడింది. త్వరలోనే నయనతార విగ్నేష్ శివన్ నెట్ ఫ్లిక్స్ లోకి రాబోతున్నారు అంటూ నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 21, 2022, 05:33 PM IST
  • విగ్నేష్ శివన్-నయనతార పెళ్లి వీడియో రెడీ
  • నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవనుందని ప్రకటన
Nayanathara: నెట్ ఫ్లిక్స్ లో నయనతార-విగ్నేష్ ల పెళ్లి వీడియో.. గెట్ రెడీ!

Nayanathara vignesh shivan marriage: సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకున్న నయనతార సినీ రంగంలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. గతంలో సినీ పరిశ్రమలో ఇద్దరితో ప్రేమాయణం నడిపిన ఆమె చివరికి దర్శకుడు విగ్నేష్ శివన్ ను ప్రేమించి ఆయననే వివాహం చేసుకుంది. జూన్ నెలలో వీరి వివాహం తిరుమలలో అంగరంగ వైభవంగా జరగాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాలతో తిరుమల నుంచి మహాబలిపురానికి వేదికను మార్చి అక్కడే గ్రాండ్గా వివాహం చేసుకున్నారు.

వీరి వివాహానికి రజనీకాంత్, షారుక్ ఖాన్, మణిరత్నం, ఇళయరాజా వంటి వారు కూడా హాజరై తమ దీవెనలు అందించారు. అయితే వీరు తమ వివాహ స్ట్రీమింగ్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సంస్థకు అమ్మివేశారు అంటూ ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ సంస్థ నుంచి ఒక అధికారిక ప్రకటన వెలువడింది. త్వరలోనే నయనతార విగ్నేష్ శివన్ నెట్ ఫ్లిక్స్ లోకి రాబోతున్నారు అంటూ నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

అయితే నయనతార భర్త కొన్నాళ్ల క్రితం కొన్ని ఫోటోలను నెట్ ఫ్లిక్స్ ఒప్పందాన్ని ఉల్లంఘించి షేర్ చేయడంతో ఆ ఒప్పందాన్ని రద్దు చేయడానికి సంస్థ సిద్ధమైంది అంటూ కొంత ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ సంస్థ స్వయంగా నయనతార విగ్నేష్ శివన్ త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో కనిపించబోతున్నారు అని ప్రకటించిన నేపథ్యంలో ఆ ఒప్పంద ఉల్లంఘన, ఒప్పందాల రద్దు అనేవి మొత్తం పుకార్లే అని తేటతెల్లం చేసినట్టే. ఇక నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసింది. ఆమె తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాలో ఆమె మెగాస్టార్ సోదరి పాత్రలో నటిస్తుండగా ఆమె భర్తగా సత్యదేవ్ నటించబోతున్నారని సమాచారం.

Also Read: Siddhartha: ఆ హీరోయిన్ తో ప్రేమలో సిద్దూ.. ఫోటోలు తీసిన వారిపై సీరియస్

Also Read: Samantha Ruthprabhu: అంతమంది పెళ్లి కాని హీరోలుండగా స్టార్ హీరోయిన్ భరపై కన్నేసిన సమంత?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News