Saripodha Sanivaram 1st Week Collections: నాచురల్ స్టార్ నాని టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఒక తరహా కథలకు పరిమితం కాకుండా వరుసగా డిఫరెంట్ మూవీ చిత్రాలతో దూసుకుపోతున్నాడు. లాస్ట్ ఇయర్ దసరా, హాయ్ నాన్న వంటి వెరైటీ కాన్సెప్ట్ చిత్రాలతో మంచి దూకుడు మీదున్నాడు. తాజాగా నాని.. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో ‘సరిపోదా శనివారం’ అంటూ సరికొత్త కాన్సెప్ట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ టాక్ మంచి వసూళ్లనే రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం లేకపోయి ఉంటే ఈ పాటికి బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని ఉండేది. ఈ చిత్రం నాని సూర్య పాత్రలో నటించాడు. కోపాన్ని అణుచుకునే వ్యక్తి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు. కేవలం వారంలో శనివారం మాత్రమే తన కోపాన్ని ఎక్స్ప్ ప్రెస్ చేస్తూ ఉంటాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నిన్నటితో ఫస్ట్ కంప్లీట్ చేసుకుంది.
ఈ సినిమా ఏరియా వైజ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే..
ఈ సినిమా తెలంగాణ (నైజాం).. రూ. 10.54 కోట్లు
రాయలసీమ (సీడెడ్).. రూ. 2.94 కోట్లు
మిగిలిన ఆంధ్ర ప్రదేశ్.. రూ. 8.84 కోట్లు..
మొత్తంగా తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ.22.32 షేర్ (రూ. 35.90 కోట్ల గ్రాస్) కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి రూ. 5.90 కోట్లు..
ఓవర్సీస్ .. రూ. 10.85 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా మొత్తంగా రూ. 39.07 కోట్ల షేర్ (71.85 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ లో 93 శాతం రికవరీ అయింది. మొత్తంగా ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ భారత్ లో ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో ఈ సినిమా ఎక్కడ బ్రేక్ ఈవెన్ పూర్తి కాలేదు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వర్షాల వల్ల బిగ్ లాస్ ఏర్పడింది. ఈ వారం విజయ్ గోట్ నుంచి ఈ సినిమాకు గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. మరో వైపు తెలుగు రాష్ట్రాల్లో వరదల వల్ల ఈ సినిమా ఇక్కడ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంటుందా అనేది డౌటే అని చెప్పాలి.
‘సరిపోదా శనివారం’ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కు రూ. 7.48 కోట్ల రాబట్టాల్సి ఉంది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా రూ. 41 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ భారత్ లో ఈ సినిమాకు ఎక్కువ వసూల్లు దక్కడంతో పాటు అక్కడ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని మంచి లాభాలను తీసుకొచ్చింది. ఈ చిత్రం ఓవరాల్ గా 2.93 బ్రేక్ ఈవెన్ దూరంలో ఆగిపోయింది. మరి ఈ వారం విడుదలై చిత్రాలతో పోటీ తట్టుకొని మరి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంటుందా లేదా అనేది చూడాలి.
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.