Naga Chaitanya ‘లవ్ స్టోరీ’ టీజర్ వచ్చేసింది

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో.. నాగ చైతన్య (naga chaitanya), సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. ఇటీవలనే ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయి.. విడుదలకు సిద్ధమవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 10, 2021, 11:33 AM IST
Naga Chaitanya ‘లవ్ స్టోరీ’ టీజర్ వచ్చేసింది

Love Story movie teaser release: టాలీవుడ్ టాప్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో.. నాగ చైతన్య (naga chaitanya), సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. ఇటీవలనే ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయి.. విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఇటీవల నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా 'లవ్ స్టోరి' (love story) పోస్టర్‌ను రిలీజ్ చేసిన మూవీ మేకర్స్.. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసి అక్కినేని ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. 

ఈ టీజర్‌లో నాగ చైతన్య, సాయిప‌ల్ల‌వి మ‌ధ్య ఉన్న భావోద్వేగ ప్రేమ సన్నివేశాలను చూపించారు. ఎప్పటిలాగానే.. శేఖర్ కమ్ముల కుటుంబ భావోద్వేగాలు, ప్రేమ, వినోదం తదితర అంశాల ఆధారంగా ఈ సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించిన‌ట్టు టీజర్‌ (Love Story teaser) ను చూస్తే అర్ధ‌మ‌వుతుంది.  Also read: Shruti Haasan: శృతి హాసన్.. గ్లామరస్ ఫొటోలు వైరల్

ఈ సినిమాకు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్‌పై కె నారాయణదాస్ నారంగ్, పి రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప‌వ‌న్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి (Sai Pallavi) తోపాటు రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. Also Read: Samantha: సమంతా.. హాట్ పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News