Mohan Babu press meet: నన్ను రెచ్చగొట్టాలని చూశారు.. MAA Elections పై మోహన్ బాబు స్పందన

Mohan Babu press meet after MAA elections 2021: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కి జరిగిన ఎన్నికలపై ప్రముఖ సీనియర్ నటుడు మోహన్ బాబు పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మా అసోసియేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన అనంతరం తన తనయుడు, మా అసోసియేషన్‌కి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ప్యానెల్ సభ్యులతో కలిసి మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 12, 2021, 08:01 AM IST
Mohan Babu press meet: నన్ను రెచ్చగొట్టాలని చూశారు.. MAA Elections పై మోహన్ బాబు స్పందన

Mohan Babu press meet after MAA elections 2021: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కి జరిగిన ఎన్నికలపై ప్రముఖ సీనియర్ నటుడు మోహన్ బాబు పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మా అసోసియేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన అనంతరం తన తనయుడు, మా అసోసియేషన్‌కి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ప్యానెల్ సభ్యులతో కలిసి సోమవారం రాత్రి మీడియా ముందుకొచ్చిన మోహన్ బాబు.. మా ఎన్నికలు (Mohan Babu about MAA election) జరిగిన తీరు, ఎన్నికల పరిస్థితులు, ఫలితాల సరళిపై తనదైన స్టైల్లో స్పందించారు. 

ఈ సందర్భంగా మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. '' మా ఎన్నికల సందర్భంగా కొంతమంది తనను రెచ్చగొట్టాలని చూశారని.. కానీ అన్నింటిని ఓపిక పట్టి భరించాను'' అని అన్నారు. సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే.. ఊరుకుందని అర్థం కాదని.. అంతకంటే వేగంతో ముందుకు దూకుతుందని అర్థం అని మోహన్ బాబు (Mohan Babu, MAA Elections) వ్యాఖ్యానించారు. తాను 17 ఏళ్ల కిందటే మా అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యానని.. ఇవాళ మళ్లీ తన బిడ్డ అదే పదవిలో ఉన్నాడని ఆయన తన పాత రోజులను గుర్తుచేసుకున్నారు. 

Also read : Manchu Vishnu: చిరంజీవి, రామ్ చరణ్ గురించి మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు

కొత్తగా ఎన్నికైన మా అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని అభినందించిన మోహన్ బాబు.. ఎప్పుడు నూతన కార్యవర్గం ఎన్నికైనా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను మర్యాదపూర్వకంగా కలిసే ఆనవాయితీ ఉందని.. అలాగే ఈసారి కూడా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి వారిని సన్మానించడంతో పాటు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిందిగా చెబుతూ మోహన్ బాబు తన కుమారుడు మంచు విష్ణు అండ్ టీమ్‌కి (Manchu Vishnu pannel) పలు సూచనలు చేశారు.

Also read : MAA elections: జూనియర్ ఎన్టీఆర్ మా ఎన్నికల్లో ఓటేయలేదు: Manchu Vishnu

Also read : Prakash Raj resigns: మా అసోసియేషన్‌కు ప్రకాశ్ రాజ్ రాజీనామా

Also read : MAA Elections 2021: 'అంకుల్ తొందరపడొద్దు'...ప్రకాశ్‌రాజ్‌ రాజీనామాపై విష్ణు స్పందన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News