Kavitha Invested Money on Liger: లైగర్ నిర్మాణం వెనుక కవిత.. ఆ డబ్బుతోనే నిర్మాణం.. జనగణమన కూడా లైన్లో... ఈడీకి సంచలన ఫిర్యాదు!

MLC Kalvakuntla Kavitha Invested Money on Liger Bakka Jadsan Alleges: ఎమ్మెల్సీ కవిత లైగర్ సినిమా నిర్మించింది అంటూ ఏఐసీసీ మెంబర్ బక్క జడ్సన్ ఫిర్యాదు చేశారు. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 6, 2022, 01:50 PM IST
 Kavitha Invested Money on Liger: లైగర్ నిర్మాణం వెనుక కవిత.. ఆ డబ్బుతోనే నిర్మాణం.. జనగణమన కూడా లైన్లో... ఈడీకి సంచలన ఫిర్యాదు!

MLC Kalvakuntla Kavitha Invested Money on Liger Bakka Jadsan Alleges: ఇప్పటికే అనేక వివాదాల్లో చిక్కుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత మీద సరికొత్త ఫిర్యాదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులకు అందింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాకు కవిత పరోక్షంగా పెట్టుబడులు పెట్టారంటూ ఏఐసీసీ మెంబర్ బక్క జడ్సన్ ఢిల్లీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో చార్మి, కరణ్ జోహార్, అపూర్వ మెహతా సహనిర్మాతలుగా వ్యవహరించిన లైగర్  సినిమాకు కవిత పెట్టుబడులు పెట్టారని ఈ విషయం మీద దర్యాప్తు జరపాలని జడ్సన్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

2017 వ సంవత్సరంలో పూరి జగన్నాథ్, చార్మి, సుబ్బరాజు, శ్యామ్ కే నాయుడు వంటి సినీ ప్రముఖుల మీద అప్పట్లో ఎక్సైజ్ శాఖ డ్రగ్స్ కేసు నమోదు చేసి విచారణ జరిపిందని, అయితే కేసీఆర్ కుటుంబం ఒత్తిడితో వారందరికీ గ్రీన్ చిట్ ఇచ్చారని జడ్సన్ ఆరోపించారు. అప్పటి పరిచయాలతో కవిత అక్రమంగా సంపాదించిన డబ్బుంతా సినిమాల్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైందని, దానికి లైగర్ సినిమాను మొదటి ప్రయత్నంగా ఎంచుకుందని ఆయన ఆరోపించారు. అదేవిధంగా అర్జున్ రెడ్డి సినిమా సమయంలోనే టీఆర్ఎస్ నేతలు ఐమాక్స్ థియేటర్ లో జర్నలిస్టులకు ఫ్రీ షో స్పాన్సర్ చేశారని తద్వారా కవిత, కెసిఆర్, విజయ్ దేవరకొండ కుటుంబాల మధ్య ఉన్న సానిహిత్యాన్ని అర్థం చేసుకుని కేసు నమోదు చేయాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.  

అదేవిధంగా కొద్ది రోజుల క్రితం ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు బయటకు రావడంతో కవిత తన పేరు ఉపయోగించకూడదు అంటూ కోర్టుకు వెళ్లి ఒక స్టే తెచ్చుకున్నారని, అదే రోజు విజయ్ దేవరకొండ ఎన్ని అవాంతరాలు వచ్చినా కొట్లాడుదాం అంటూ ఒక ట్వీట్ చేశాడని ఇవన్నీ కూడా ఇంటర్ లింక్డ్ గా తనకు అనిపిస్తున్నాయని జడ్సన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. కవిత తమ అక్రమార్జన ద్వారా సంపాదించిన డబ్బు అంతా లైగర్ సినిమాలో పెట్టుబడిగా పెట్టిందని అలాగే కేసిఆర్ కుటుంబానికి బినామీలుగా చెప్పుకుంటున్న మై హోమ్ సంస్థ విజయ్ దేవరకొండ నటించే జనగణమన సినిమాను నిర్మిస్తోందని ఇవన్నీ చూస్తుంటే కవిత అక్రమార్జనంతా ఇక మీద సినిమాల మీద పెట్టాలని చూస్తున్నట్లు అనిపిస్తోందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఒకప్పుడు అలా వచ్చిన డబ్బు అంతా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పేరు మీద పెట్టేవారని ఇప్పుడు కొత్తగా సినిమాల మీద పెడుతున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. మరి ఈ వ్యవహారం మీద కవిత అలాగే టిఆర్ఎస్ శ్రేణులు ఎలా స్పందిస్తాయి అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే జడ్సన్ తన ఫిర్యాదులో పేర్కొనలేదు కానీ విజయ్ దేవరకొండ కెసిఆర్ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో కొన్నాళ్ల క్రితం కేసీఆర్ ప్రభుత్వం విజయ్ దేవరకొండను ప్రమోట్ చేస్తుందని వాదన కూడా తెరమీదకు వచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఆరోపణలు ఆ సామాజిక వర్గం అంశాన్ని మరోసారి తెరమీదకు తెచ్చే అవకాశాలు లేకపోలేదు.
Also Read: Mahesh fans vs Vijay fans: రెచ్చిపోయిన స్టార్ హీరోల అభిమానులు.. రాయలేని విధంగా ట్రోలింగ్

Also Read: Sita Ramam on Amazon Prime: సీతా రామం ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు.. ఎప్పుడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News