Chiranjeevi Mother: నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు.. మరు జన్మలకి కూడా కావాలి! చిరంజీవి భావోద్వేగం!!

నేడు టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి అమ్మ అంజనా దేవి పుట్టిన రోజు. ప్రస్తుతం చిరంజీవి క్వారంటైన్‌లో ఉన్న నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 29, 2022, 10:32 AM IST
  • అంజనా దేవి పుట్టిన రోజు
  • చిరంజీవి భావోద్వేగం
  • సోషల్ మీడియాలో విషెష్
Chiranjeevi Mother: నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు.. మరు జన్మలకి కూడా కావాలి! చిరంజీవి భావోద్వేగం!!

Chiranjeevi Mother Anjana Devi Birth Day: టాలీవుడ్‌ 'మెగాస్టార్‌' చిరంజీవి (Chiranjeevi) కరోనా వైరస్ (Covid 19) మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. బుధవారం (జనవరి 26) తనకు కరోనా సోకిందని  మెగాస్టార్‌ స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలిపారు. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్న చిరు.. వైద్యుల సూచనల మేరకు మెడిసిన్స్ వాడుతున్నారు. ప్రస్తుతం చిరంజీవికి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయట. ఆయన ఆరోగ్యం బాగుందని సమాచారం. 

నేడు మెగాస్టార్‌ చిరంజీవి అమ్మ అంజనా దేవి (Anjana Devi) పుట్టిన రోజు. ప్రస్తుతం చిరంజీవి క్వారంటైన్‌లో ఉన్న నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా విష్ చేశారు. 'అమ్మా.. జన్మదిన శుభాకాంక్షలు. క్వారంటైన్‌ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక.. ఇలా తెలుపుతున్నా. నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు.. మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నా' అని మెగాస్టార్‌ భావోద్వేగం చెందారు. తన ట్వీటుకు ఓ ఫొటో జత చేశారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది.

Also Read: U19 World Cup 2022: టీమిండియాకు భారీ షాక్‌.. స్టార్ ఆటగాడికి పాజిటివ్! కెప్టెన్ ఎవరంటే?!!

అమ్మ అంటే చిరంజీవికి చాలా ఇష్టం. ఇప్పటికి ఎంత బిజీగా ఉన్నా కూడా కచ్చితంగా అమ్మతో చాలా టైమ్ స్పెండ్ చేస్తుంటారు. తన సినిమాలను కూడా తల్లితో కలిసి చూస్తుంటారు మెగాస్టార్. అందుకే చిరు పోస్ట్ చేసి భావోద్వేగం చెందారు. ఇక అంజనా దేవి పుట్టిన రోజు వేడుకలు మెగాస్టార్‌ కుటుంబ సభ్యులు చేశారు. మెగా ఫామిలీ మొత్తం ఆమెకు శుభాకాంక్షలు (Chiranjeevi Mother Anjana Devi Birth Day) చెపుతున్నారు. మరోవైపు ఫాన్స్ కూడా సోషల్ మీడియాలో విషెష్ చెపుతున్నారు. 

'అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటీకీ కరోనా వైరస్ బారిన పడ్డాను. నిన్న రాత్రి తేలికపాటి లక్షణాలు ఉండడంతో.. కరోనా టెస్ట్‌ చేయించుకున్నా. పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం నేను హోం క్వారంటైన్‌లో ఉన్నాను. ఇటీవ‌ల న‌న్ను క‌లిసిన ప్రతి ఒక్కరు వెంట‌నే క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరుతున్నా. త్వరలోనే మీ అందరిని తిరిగి కలుస్తా' అని చిరంజీవి బుధవారం ట్వీట్‌ చేశారు.

Also Read: Shyam Singha Roy: రోజీ సింగరాయ్ కోసం.. ఆన్‌లైన్‌ క్లాస్‌లోకి వచ్చిన శ్యామ్‌ సింగరాయ్‌! షాక్‌లో హీరో నాని!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News