Trisha: త్రిషకి క్షమాపణ చెప్పేదే లేదు.. తేల్చి చెప్పేసిన మన్సూర్ అలీ ఖాన్

Trisha controversy: గత కొద్దిరోజులుగా త్రిష, మన్సూర్ అలీ ఖాన్ మధ్య జరుగుతున్న వివాదం పెద్ద చర్చకు దారితీస్తోంది. ఎంతోమంది ప్రముఖులు త్రిషకి మధ్యత తెలుపుతూ మన్సూర్ ఆలీ ఖాన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండగా.. తను త్రిషాకి క్షమాపణ చెప్పేదే లేదు అని ప్రెస్ మీట్ పెట్టి మరి క్లారిటీ ఇచ్చారు మన్సూర్ అలీ ఖాన్

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 21, 2023, 08:49 PM IST
Trisha: త్రిషకి క్షమాపణ చెప్పేదే లేదు.. తేల్చి చెప్పేసిన మన్సూర్ అలీ ఖాన్

Mansoor Ali Khan: త్రిష, మన్సూర్ అలీ ఖాన్ మధ్య జరుగుతున్న వివాదం రోజురోజుకి పెద్ద తుఫానుగా మారుతోంది.‌  ఇప్పటికే ఈ వివాదం గురించి పలు పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేయగా ఈరోజు ఉదయం మెగాస్టార్ చిరంజీవి కూడా త్రిషకు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. 

అసలు విషయానికి వస్తే లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన లియో సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించిగా…తమిళంలో పాపులర్ విలన్  మన్సూర్ అలీఖాన్ కూడా నటించారు. కాగా ఒక ప్రెస్ మీట్ లో మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ..లియో సినిమాలో త్రిష, తాను నటిస్తున్నామని తెలిశాక.. త్రిషను తన చేతులతో ఎత్తుకుని బెడ్రూంకి తీసుకెళ్లే సీన్ ఉంటుందని, రేప్ చేసే సీన్ ఉంటుందేమో అని అనుకున్నా. కానీ కనీసం త్రిష ముఖాన్ని కూడా నాకు చూపించలేదు..అంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ విషయంపై వెంటనే త్రిష తీవ్రంగా స్పందించింది. అసలు ఇలాంటి నటుడుతో ఇంక లైఫ్ లో నటించను అంటూ ప్రతిజ్ఞ చేసింది. ఆ తరువాత ప్రతి ఒక్కరూ త్రిషకి మద్దతుగా నిలిచి మన్సూర్ ఆలీ ఖాన్ పైన తమ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో ఎంతోమంది డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై స్పందిస్తూ మన్సూర్ సారీ చెప్పాలని నడిగర్ సంఘం డిమాండ్ చేస్తుండగా.. దానికి మన్సూర్ ఘటైన సమాధానం ఇవ్వడం ఇప్పుడు ఇంకొంచెం వివాదం అవుతోంది. త్రిషపై చేసిన వల్గర్ కామెంట్స్ కి స్పందిస్తూ నడిగర్ సంఘం మన్సూర్‌పై తాత్కాలికంగా నిషేధం విధించింది. త్రిషకు సారీ చెబితేనే ఈ నిషేధాన్ని తొలగిస్తామని స్పష్టం చేసింది. కానీ తాను త్రిషా కి క్షమాపణ చెప్పడం చెయ్యను అని మన్సూర్ కరా కందిగా చెప్పడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

కాగా ఈ విషయం పైన మంగళవారం చెన్నైలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన మన్సూర్ అలీఖాన్ త్రిషకు క్షమాపణలు చెప్పేది లేదన్నారు. తనపై నిషేధం విధించడం ద్వారా నడిగర్ సంఘం మిస్టేక్ చేసింది అని.. తన నుంచి వివరణ కోరితే బాగుండేదన్నారు. ఇక ఏకంగా తనపై నిషేధం విధిస్తూ జారీ చేసిన స్టేట్‌మెంట్‌ను వెనక్కి తీసుకోవడానికే నడిగర్ సంఘానికి మన్సూరే కొంత టైం ఇచ్చారు.

ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ..’నేను మీకు క్షమాపణలు చెప్పేవాడిలా కనిపిస్తున్నానా..? మీడియా నాకు వ్యతిరేకంగా నచ్చినట్టు రాసుకోవచ్చు. కానీ జనాలకి నేనేంటి అనేది తెలుసు. తమిళ ప్రజల మద్దతు నాకు ఉంది.  సినిమాల్లో రేప్ సీన్ అంటే నిజంగా రేప్ చేస్తారా..? సినిమాల్లో మర్డర్ సీన్ అంటే నిజంగా మర్డర్ చేస్తారా? కొంచెమైనా బుద్దుందా? నేనేమీ తప్పుగా మాట్లాడలేదు. క్షమాపణలు చెప్పడం జరగదు’ అంటూ  వ్యాఖ్యలు చేశారు మన్సూర్.

Also Read: Samsung Mobile Loot Offer: సాంసంగ్‌ వెబ్‌సైట్‌లో పిచ్చెక్కించే డీల్స్‌..Galaxy F54, M34 మొబైల్స్‌పై భారీ తగ్గింపు!  

Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News