Mohan Babu Political Comments: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సెటైరికల్ పంచ్ డైలాగ్స్ కు మోహన్ బాబు ఫుల్ ఫేమస్. అలాంటిది ఆయన గత కొద్దికాలంగా చాలా విషయాలకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్న ఈ తరుణంలో.. ఇటీవల కొందరు తన పేరును రాజకీయంగా వాడుకుంటున్నారని, అలాంటి వారిపై న్యాయపరమైన చర్యలు కూడా తీసుకుంటాము అంటూ హెచ్చరిస్తూ రీసెంట్గా మోహన్ బాబు ఓ ప్రెస్ నోట్ ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ప్రెస్ నోట్ పై నెటిజన్లు తమ స్టైల్ లో స్పందిస్తున్నారు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో వందల సినిమాలు చేసి.. కలెక్షన్ కింగ్ గా రికార్డు నెలకొల్పి.. తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన గొప్ప నటుడు మోహన్ బాబు. ఒక టైం లో విపరీతమైన స్టార్డం అనుభవించిన ఈ స్టార్ హీరో ఆ తర్వాత రాజకీయాలలో కూడా చాలా రోజులు యాక్టివ్ గా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇటు రాజకీయాలకు ..అటు సినిమాలకు కాస్త దూరంగా అంటి ముట్టనట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇచ్చినటువంటి ఈ ప్రెస్ నోట్ పలు రకాల అనుమానాలకు దారితీస్తోంది.
విజ్ఞప్తి pic.twitter.com/kHnATpRdA5
— Mohan Babu M (@themohanbabu) February 26, 2024
ఇంతకీ ఆ ప్రెస్ నోట్ లో ఏముందంటే.. “ ఈ మధ్య కాలంలో కొందరు నా పేరుని రాజకీయంగా ఉపయోగిస్తున్నారని నా దృష్టికి వచ్చింది. దయచేసి ఎవ్వరూ వ్యక్తిగతంగా కానీ..పార్టీ కోసమైనా కానీ నా పేరుని వాడకూడదని విజ్ఞప్తి చేస్తున్నాను. మనం అనేక రకాల భావావేశాలు కలిగిన వ్యక్తులు ఉన్న ప్రపంచంలో జీవిస్తున్నాము. కాబట్టి ఎవరి అభిప్రాయాలు వారిని .అది వారి వ్యక్తిగతం కూడా. చేతనైతే నలుగురికి సహాయపడడంలో మనం దృష్టి పెట్టాలి. అంతేకానీ సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలలోకి లేక వాటి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం చాలా బాధాకరమైన విషయం. మనం శాంతి, సౌబ్రాతృత్వాన్ని వ్యాపించాలని నేను కోరుకుంటున్నాను. వీటిని ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు కూడా తీసుకుంటానని హెచ్చరిస్తున్నాను.. మీ మోహన్ బాబు.”అంటూ తన మనసులోని భావాలను ఓ సుదీర్ఘమైన ప్రెస్ నోట్ ద్వారా వెల్లడించారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏ రాజకీయ పార్టీ ఆయన పేరు వాడుకుంది? అసలు ఇంతగా సీరియస్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
Also Read: Telangana: ముఖ్యమంత్రి అవుతాడని రేవంత్ రెడ్డి స్వగ్రామంలోనే ఎవరూ నమ్మలేదు: కేటీఆర్
Also Read: VIPs Drivers: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ప్రముఖుల డ్రైవర్లకు 'ఫిట్నెస్ టెస్టులు'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి