Anushka Shetty : అనుష్క కావాలంటే యాభై లక్షలా?.. సినీ మేనేజర్ గుట్టు రట్టు

Anushka Shetty Manager అనుష్క శెట్టి పేరు మీదుగా సినీ మేనేజర్ చేసిన మోసం బయటకు వచ్చింది. అనుష్కతో మీటింగ్ ఏర్పాటు చేయాలంటే యాభై లక్షలు ఇవ్వాలంటూ నిర్మాతలను మోసం చేశాడట. ప్రస్తుతం ఈ చీటింగ్ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 25, 2023, 01:53 PM IST
  • టాలీవుడ్‌లో కొత్త రకమైన మోసం
  • అనుష్క పేరుతో మేనేజర్ చీటింగ్
  • యాభై లక్షలిస్తే మీటింగ్?
Anushka Shetty : అనుష్క కావాలంటే యాభై లక్షలా?.. సినీ మేనేజర్ గుట్టు రట్టు

cheating with Name of Anushka Shetty సినీ నటి అనుష్క అపాయింట్ మెంట్ కావాలంటే యాభై లక్షలు ఇవ్వాలంటూ నిర్మాతకు గాలమేసి మోసం చేశాడు ఓ మేనేజర్. ఇలాంటి మోసాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న రష్మిక మందన్న పేరుతో ఇలాంటి మోసాలే జరిగాయి. ఇప్పుడు ఓ అప్ కమింగ్ ప్రొడ్యూసర్ లక్ష్మన్ చారీని మోసం చేశాడు మేనేజర్ ఎల్లారెడ్డి.

విశ్వకర్మ క్రియేషన్స్ అధినేత, నిర్మాత లక్ష్మన్ చారీ నుండి 51 లక్షలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. అనుష్క, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ డేట్స్ ఇప్పిస్తామంటూ నిర్మాతను మోసం చేశాడట. చివరకు తాను మోసపోయానని తెలుసుకున్న నిర్మాత బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు.

తనను పలు మార్లు బెంగళూర్ తీసుకెళ్లాడని,  అక్కడ మోతి మహల్ హోటల్‌లో పలువురిని పరిచయం చేశాడట. చివరకు తాను ఎల్లారెడ్డి చేతిలో మోసపోయానంటూ సదరు నిర్మాత తెలుసుకోవడంతో ఇలా న్యాయం కోసం పోలీసుల వద్దకు చేరుకున్నాడు.

అంతకు ముందు నిర్మాతల మండలికి ఫిర్యాదు చేయడంతో..మేనేజర్ ఎల్లారెడ్డిని ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు దొరై మందలించాడట. అయినా తిరిగి డబ్బులు ఇవ్వకపోవడంతో ..బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడట.

Also Read:  Naatu Naatu oscar Nominations : టాలీవుడ్ హిస్టరీలో ఫస్ట్ టైం.. నామినేట్ అయిన నాటు నాటు

Also Read: Pawan Kalyan's Fan Death News: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. అభిమాని మృతి, ముగ్గురికి గాయాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News