Family Star : ఫ్యామిలీ స్టార్ తో విజయ్ ఖాతా లో మరొక ఫ్లాప్.. అసలు తప్పు అక్కడే జరుగుతోందా!

Vijay Deverakonda : యువ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరో గా విడుదల అయిన ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడింది. పరశురామ్ దర్శకత్వం లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా తో విజయ్ కెరియర్ లో మరొక డిజాస్టర్ సినిమా వచ్చి చేరింది. అసలు సినిమాల విషయం లో విజయ్ దేవరకొండ చేస్తున్న తప్పు ఎంటి అని సోషల్ మీడియా వర్గాల్లో కూడా చర్చ మొదలైంది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 8, 2024, 09:16 PM IST
Family Star : ఫ్యామిలీ స్టార్ తో విజయ్ ఖాతా లో మరొక ఫ్లాప్.. అసలు తప్పు అక్కడే జరుగుతోందా!

Family Star Collections: యువ హీరో విజయ్ దేవరకొండ గత కొంతకాలం గా వరుస డిజాస్టర్ లతో సతమవుతున్న సంగతి తెలిసిందే. ఖుషి తో పర్వాలేదు అనిపించినా బ్లాక్ బస్టర్ కోసం వెతుకుతున్న విజయ్ తన ఆశలన్నీ ఫ్యామిలీ స్టార్ సినిమా పైనే పెట్టుకున్నారు. ఏప్రిల్ 5 న సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విడుదల అయ్యింది.

విడుదలకు ముందు నుంచే అంత హైప్ లేని ఈ సినిమా విడుదల తర్వాత కూడా మంచి కలెక్షన్లు అందుకోలేక పోయింది. మొదటి రోజే బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడింది ఈ చిత్రం. చిత్ర నిర్మాత దిల్ రాజు మాత్రం తమ సినిమా తొంభై శాతం ప్రేక్షకులకు నచ్చిందని, అందరూ టీం ను అభినందిస్తున్నారని చెబుతున్నారు కానీ సోషల్ మీడియా లో టాక్ మాత్రం వేరుగానే ఉంది. 

పబ్లిక్ టాక్, రివ్యూలు కూడా అంతంతమాత్రం గానే ఉన్నాయి. అయితే ఫైనల్ రన్ ఇంకా పూర్తవ్వలేదు కాబట్టి సినిమా హిట్టా కాదా అని చెప్పడం కష్టమే కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఇకపై అయినా సినిమా కథల విషయం లో మారాల్సిన అవసరం ఉంది. విజయ్ దేవరకొండ ఈ సినిమా ను ఎన్ని రకాలుగా ప్రమోట్ చేసినప్పటికీ సినిమా ఓపెనింగ్స్ కూడా నిరాశపరిచాయి. 

రౌడీ హీరో, యంగ్ సెన్సేషన్ వంటి పేర్లతో విజయ్ దేవరకొండ అభిమానులకి బాగానే దగ్గరయ్యాడు కానీ సినిమాల పరంగా మాత్రం ప్రేక్షకులను అలరించలేకపోతున్నారు. ముఖ్యంగా స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో విజయ్ దేవరకొండ చేస్తున్న తప్పులు అభిమానులు సైతం ఒప్పుకోలేకపోతున్నారు. ఇది లైగర్ సినిమా నుంచి మొదలైంది అని చెప్పుకోవచ్చు. 

ప్రమోషన్స్ ఎంత భారీ స్థాయిలో చేసినప్పటికీ సినిమాలో కంటెంట్ లేకుండా హిట్ అయ్యే అవకాశాలు తక్కువే. పైగా ఈ మధ్యకాలంలో కమర్షియల్ సినిమాలు కూడా ఆడే అవకాశాలు కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో చిన్న చిన్న కథలతో విజయ్ దేవరకొండ భారీ బ్లాక్ బస్టర్ అందుకోవడం జరగని పని. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ ఎంత త్వరగా నమ్మితే అంత బాగుంటుంది అని అభిమానులు ఆశిస్తున్నారు.

కొత్త డైరెక్టర్లను కాదని అనుభవం ఉన్న డైరెక్టర్లతో పని చేయడంలో తప్పులేదు కానీ కథ విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం విజయ్ దేవరకొండ కి ఉంది. కొత్త డైరెక్టర్లతో సినిమా చేసిన కూడా నాని ఇలాంటి హీరోలు బ్లాక్ బస్టర్లు అందుకుంటున్నారు. కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్లతో చేసుకో కూడా విజయ్ దేవరకొండ ఇలాంటి ఫ్లాప్ సినిమాలు తో ముందుకు రావడం అభిమానులను కూడా నిరాశ పరుస్తుంది.

Also Read: Revanth Reddy Flight: రేవంత్‌ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం ...

Also Read: TS Weather: తెలంగాణ ప్రజలకు ఎండల నుంచి ఊరట.. రాగల మూడు రోజులు వర్షాలు

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News