Sarkaru Vaari Paata: మహేష్ బాబు డబుల్ రోల్స్ ఇవేనా ?

మహేష్ బాబు ( Mahesh Babu ) అప్‌కమింగ్ మూవీ 'సర్కారు వారి పాట'పై ( Sarkaru Vaari Paata ) సూపర్ స్టార్ అభిమానుల్లో ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

Last Updated : Sep 4, 2020, 09:45 PM IST
Sarkaru Vaari Paata: మహేష్ బాబు డబుల్ రోల్స్ ఇవేనా ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) అప్‌కమింగ్ మూవీ 'సర్కారు వారి పాట'పై ( Sarkaru Vaari Paata ) సూపర్ స్టార్ అభిమానుల్లో ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గీతా గోవిందం ఫేమ్ పరశురాం డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా మొదటి షూటింగ్ షెడ్యూల్ అక్టోబర్‌లో ప్రారంభమవనున్నట్టు ఫిలింనగర్ టాక్. ఐతే ఈ చిత్ర షూటింగ్ కోసం చిత్ర బృందం దసరా తరువాత అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్స్ చేయబోతున్నట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ పుకార్లే నిజమైతే, మహేష్ ఈ చిత్రంలో ఒక పాత్రలో పాన్ బ్రోకర్‌గా ( Pawn broker ), మరో పాత్రలో బ్యాంక్ ఆఫీసర్ పాత్ర ( Bank officer ) పోషించనున్నట్లు టాక్. ఈ సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్స్ గురించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడనప్పటికి ఈ రూమర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Also read : VV Vinayak meets Chiranjeevi చిరంజీవితో వివి వినాయక్‌ సినిమా ?

ఇటీవల 'సర్కారు వారి పాట' సినిమా ప్రీ-ప్రొడక్షన్‌ పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ ( Keerthy Suresh ) జంటగా నటిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతి నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టును జిఎంబి ఎంటర్టైన్మెంట్ సహకారంతో మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. Also read : Sanjjana Garlani: డ్రగ్ డీలర్స్‌తో సంబంధాలు వార్తలపై స్పందించిన సంజన

Mahesh Babu 45వ పుట్టిన రోజు సందర్భంగా సర్కారు వారి పాట మోషన్ పోస్టర్ అభిమానుల్లో సంచలనం సృష్టించింది. తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ సైతం అభిమానుల అంచనాలను పెంచింది. Also read : Vijayashanti: వారు చనిపోతే.. సుశాంత్ కేసులా దర్యాప్తు జరిగిందా?

Trending News