Mahesh Babu - Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో మరో టాలీవుడ్ బడా స్టార్ హీరో..?

Mahesh babu - Rajamouli: మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. వారి ఆశలు ఫలించే రోజులు దగ్గర పడ్డాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమైన ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో టాలీవుడ్‌కు చెందిన మరో స్టార్ హీరోగా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.  

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 2, 2024, 04:00 PM IST
Mahesh Babu - Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో మరో టాలీవుడ్ బడా స్టార్ హీరో..?

Rajamouli - Mahesh Babu - Nagarjuna : రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు యాక్ట్ చేయాలని ఆయన అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రచయత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాను కథను రెడీ చేసారు. మరో వైపు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైంది. ఈ సినిమాలో పాత్ర కోసం మహేష్ బాబు స్పెషల్‌గా ట్రెయిన్ కూడా అవుతున్నాడు. రాజమౌళి సినిమా కోసం  స్టంట్స్ యాక్షన్ సీన్స్ కోసం మహేష్ బాబు జర్మనీ వెళ్లాడు. అక్కడ ప్రముఖ వ్యాయామ నిపుణులు హ్యారీ కొనిగ్‌తో కలిసి ట్రెక్కింగ్ చేస్తున్న చేస్తోన్న ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకోవడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అంతేకాదు కొన్ని యాక్షన్స్ సీన్స్ కోసం ప్రత్యేకంగా ట్రెయిన్ అవుతున్నాడు.

ఈ సినిమాలో మహేష్‌ బాబు పాత్రతో పాటు మరో ఇంపార్టెంట్ రోల్ ఉందట. ముందుగా ఈ పాత్ర కోసం బాలకృష్ణతో పాటు విక్రమ్, కమల్ హాసన్ వంటి హీరోలను అనుకున్నారు. కానీ వర్కౌట్ కాలేదు. తాజాగా ఈ సినిమాలో టాలీవుడ్ మన్మథుడు కింగ్ నాగార్జున ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే నాగార్జునకు విజయేంద్ర ప్రసాద్‌తో పాటు రాజమౌళి కలిసి స్టోరీని ఎక్స్‌ప్లేన్ చేసినట్టు సమాచారం. గతంలో విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో చేసిన రాజన్న సినిమాలో యాక్షన్ సీన్స్ కొన్ని జక్కన్న డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. అదే చనువుతో రాజమౌళి సినిమా కథ చెప్పగానే నాగార్జున ఈ మూవీకి ఓకే చెప్పినట్టు సమాచారం.

నాగార్జునకు ప్యాన్ ఇండియా ప్రేక్షకులు గుర్తు పడతారు. యేడాదిన్నర క్రితం రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ హీరో, హీరోయిన్లుగా నటించిన 'బ్రహ్మాస్త్ర'లో నాగార్జున కీ రోల్ పోషించిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు తాజాగా మహేష్ బాబు, రాజమౌళి ప్యాన్ ఇండియా మూవీలో నాగార్జున భాగం కాబోతున్నట్టు సమాచారం. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది. ఇక ఈ సినిమా నిర్మాత కే.ఎల్. నారాయణతో కూడా నాగార్జునకు మంచి అనుబంధమే ఉంది. ఈయన నిర్మాణంలో గతంలో హలో బ్రదర్, సంతోషం వంటి చిత్రాలు కూడా చేసాడు. ఈ నేపథ్యంలో నాగార్జున రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో భాగం కావడం కన్ఫామ్ అని చెబుతున్నారు. రీసెంట్‌గా నాగార్జున.. సంక్రాంతి బరిలో 'నా సామిరంగ' మూవీతో పలకరించాడు. అటు మహేష్‌ బాబు..గురుజీ తెరకెక్కించిన గుంటూరు కారంతో పలకరించారు. ఈ రెండు చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి.

Also read: TS School Holiday: విద్యార్థులకు అలర్ట్.. ఫిబ్రవరి 8న స్కూళ్లకు సెలవు.. కారణం ఇదే..!

Also read: Ayodhya Ram Mandir Darshan: బాలరాముని దర్శనానికి భారీ రద్దీ.. ఆలయ సమయంలో మార్పులు.. కొత్త షెడ్యూల్ ఇదే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News