MAA Elections: ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్ నుంచి గెలిచిన వారంతా రాజీనామా

Prakash Raj Announces Resigns his panel: రెండు రోజులుగా జరుగుతున్న ఘటనలపై తన ప్యానెల్‌ సభ్యులతో చర్చించామన్నారు. తమ ప్యానల్‌కు పోస్టల్‌ బ్యాలెట్‌లో అన్యాయం జరిగిందని ప్రకాశ్‌ రాజ్‌ అన్నారు. రాత్రికి రాత్రే ఫలితాలు మారాయన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 12, 2021, 06:19 PM IST
  • తమ ప్యానెల్‌ నుంచి గెలిచిన వారంతా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించిన ప్రకాశ్‌రాజ్‌
  • బెనర్జీ లాంటి సీనియర్‌ నటుడిపై చేయి చేసుకోవడం బాధాకరం
  • తన రాజీనామాను వెనక్కి తీసుకునేందుకు షరతు పెట్టిన ప్రకాశ్‌రాజ్
MAA Elections: ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్ నుంచి గెలిచిన వారంతా రాజీనామా

MAA elections 2021 Prakash Raj Announces Resigns his total panel t0 MAA: తమ ప్యానెల్‌ నుంచి గెలిచిన వారంతా రాజీనామా చేస్తున్నట్లు సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ (Prakash Raj) వెల్లడించారు. మంచు విష్ణు (Manchu vishnu) ఇచ్చిన హామీలకు అవరోధాలు ఏర్పడకుండా ఉండేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకాశ్‌రాజ్‌ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రోజులుగా జరుగుతున్న ఘటనలపై తన ప్యానెల్‌ సభ్యులతో చర్చించామన్నారు. తమ ప్యానల్‌కు పోస్టల్‌ బ్యాలెట్‌లో అన్యాయం జరిగిందని ప్రకాశ్‌ రాజ్‌ అన్నారు. రాత్రికి రాత్రే ఫలితాలు మారాయన్నారు. 

తమ ప్యానెల్‌లోని గెలిచిన వారంతా రాజీనామాలు చేసి బయటకు వచ్చి ‘మా’ సభ్యుల (maa members) తరఫున నిలబడతామన్నారు. ఇక ఎన్నికల్లో మొదటి రోజు గెలిచినవారు రెండోరోజు ఎలా ఓడిపోయారని ప్రశ్నించారు. అయినా ఇలాంటి వాతావరణంలో పని చేయగలమా అని గెలిచిన మా సభ్యులు అన్నారు. మోహన్‌ బాబు ఎ‍న్నికల ప్రక్రియలోనే కూర్చున్నారన్నారు. ఎక్కడెక్కడి నుంచో మనుషులను తెచ్చారని ప్రకాశ్‌రాజ్ (Prakash Raj) అన్నారు.. క్రమశిక్షణ లేకుండా బెనర్జీ లాంటి (banerjee) సీనియర్‌ నటుడిపై చేయి చేసుకున్నారంటూ ప్రకాశ్‌రాజ్‌ పేర్కొన్నారు. 

Also Read : viral Wedding Dance: అదిరిపోయిన బావ-మరదలు డ్యాన్స్..నెటిజన్లతో ఈల వేయిస్తున్న వీడియో

ప్రకాశ్‌రాజ్‌ తాజాగా మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే తన రాజీనామాను మంచు విష్ణు స్వీకరించనని అన్నారని ప్రకాశ్‌రాజ్‌ చెప్పారు. అయితే తాను తన రాజీనామాను వెనక్కి తీసుకుంటానని, అందుకు ఒక షరతు ఉందన్నారు. విష్ణు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ‘మా’ నియమ, నిబంధనలు మార్చాలన్నారు. తెలుగువాడు కాని వ్యక్తి మా ఎన్నికల్లో (MAA elections) పోటీ చేయకూడదు అని విష్ణు మార్చకపోతే తన సభ్యత్వానికి చేసిన రాజీనామాను వెనక్కి తీసుకుంటా అన్నారు. ఒకవేళ మారిస్తే, ఓటు వేయడానికో, గెలిపించడానికో నాకు ఇష్టం లేదు అని ప్రకాశ్‌రాజ్‌ (Prakash Raj) స్పష్టం చేశారు. 

Also Read : Live Audio feature:లైవ్ ఆడియో రూమ్స్ ఫీచర్‌తో పాటు Soundbites కూడా రెడీ చేస్తోన్న Fb

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News