Lorry Chapter 1 Movie Review:‘లారీ చాప్టర్ 1 మూవీ.. ప్యాన్ ఇండియా మూవీ మెప్పించిందా..!

Lorry Chapter 1 Movie Review: ఈ మధ్య కాలంలో తెలుగు సహా వివిధ భాషల్లో ప్యాన్ ఇండియా చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఈ కోవలో తెరకెక్కిన చిత్రం ‘లారీ ఛాప్టర్ 1.  ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా.

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 3, 2024, 06:10 PM IST
Lorry Chapter 1 Movie Review:‘లారీ చాప్టర్ 1 మూవీ.. ప్యాన్ ఇండియా మూవీ మెప్పించిందా..!

చిత్రం: లారీ - చాప్టర్ 1  
నటీనటులు: శ్రీకాంత్ రెడ్డి ఆసం, చంద్రశిఖా శ్రీవాస్, రాకీ సింగ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: తాడిపత్రి నాగార్జున  
బ్యానర్: కింగ్ మేకర్ పిక్చర్స్  
నిర్మాత: ఆసం వెంకట లక్ష్మి  
దర్శకత్వం, నిర్మాత, హీరో, సంగీత దర్శకుడు, ఎడిటర్, స్టంట్ మాస్టర్: శ్రీకాంత్ రెడ్డి ఆసం  
విడుదల తేదీ: ఆగస్టు 2, 2024  

తన వీడియోలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ప్ర‌ముఖ యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి ఆసం (@SreekanthReddy_Asam) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "లారీ - చాప్టర్ 1" (@lorrychapter-1Movie). శ్రీకాంత్ రెడ్డి ఆసం తన తొలి చిత్రంలో హీరోగా, దర్శకత్వం వహిస్తూ, సంగీత దర్శకుడు, ఎడిటర్, స్టంట్ మాస్టర్‌గా కూడా పనిచేశారు. అంతేకాదు ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలి, హిందీలో ఈ సినిమాను తెరకెక్కించాడు.  కింగ్ మేకర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆసం వెంకట లక్ష్మి నిర్మించిన ఈ చిత్రంలో చంద్రశిఖా కథానాయికా నటించింది. రాకీ సింగ్ లీడ్ రోల్లో యాక్ట్  చేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం.

కథ:
చిత్తూరు దగ్గర రంగపట్నంలో నివసించే హర్షవర్ధన్ ఆలియ‌స్ హంటర్ (శ్రీకాంత్ రెడ్డి ఆసం) వీధి రౌడీగా తన జీవితం కొనసాగిస్తూ ఉంటాడు.   తన ఫ్యామిలీని  పోషించడానికి చిన్న చిన్న గొడవల్లోకి వెళ‌తాడు. ఒక సందర్భంలో జైలు పాలవతాడు. ఆ తరువాత ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె రాకతో అతనిలో మార్పు మొదలవుతోంది. ఈ క్రమంలో  మెకానిక్ షాప్ పెట్టి సాధారణ జీవితం ప్రారంభించాలని ప్రయత్నిస్తాడు. ఈలోగా ప్రతాప్ అనే మైనింగ్ అధిపతి ముఖ్యమంత్రి అవ్వాలని, ఇల్లీగల్ మైనింగ్ చేస్తుంటాడు. అతనికి మైనింగ్ అక్రమ రవాణా చేయడానికి హర్షవర్ధన్ కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకుంటాడు. ఈ క్రమంలో 3 వేల కోట్ల సరుకు డెలవరీ చేయడానికి లారీ డ్రైవ్ చేస్తాడు.ఈ క్రమంలో అతన్ని అడ్డుకోవానికి వివిధ ప్రయత్నాలు జరుగుతాయి. చివరకు హీరో తాను చేరాలనుకున్న గమ్యాన్ని చేరాడా లేదా అనేది మిగతా స్టోరీ.  

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

ఇప్పటికే యూట్యబర్ గా ప్రేక్షకులకు చేరువైన శ్రీకాంత్.. ఇపుడు హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నాడు. అంతేకాదు తొలి సినిమాతోనే ఇలాంటి భారీ సబ్జెక్ట్ ను ఎంచుకోవడం మాములు విషయం కాదు. "లారీ - చాప్టర్ 1" యాక్షన్, డ్రామా, సస్పెన్స్‌తో ప్రేక్షకులను ఎంగేజ్ చేసాడు. అంతేకాదు ప్రెజెంట్ యూత్ కు కావాల్సిన లవ్, రొమాన్స్ సీన్లలో ఆకట్టుకున్నాడు. లవ్ ప్లస్ యాక్షన్ తో పాటు అన్న‌-చెల్లెలు సెంటిమెంట్‌, తండ్రి-కొడుకుల సెంటిమెంట్ సీన్లతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసాడు. మొత్తంగా ఓ యూట్యూబర్ నుంచి సినిమా నిర్మించి దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా చేసి మెప్పించడం అనేది మాముల విషయం కాదు. అక్కడక్కడ కొన్ని లోపాలున్నా.. ఓవరాల్ ఓ వర్గం ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది.  

ఈ సినిమాకు తాడిపత్రి నాగార్జున అందించిన విజువల్స్ సినిమాకి స్పెసల్ అట్రాక్షన్ గా నిలిచాయి.  మ్యూజిక్ ట్రాక్ పర్వాలేదు.ఎడిటింగ్ తన కత్తెరకు కాస్త పదను పెట్టుండే బాగుంది. అక్కడక్కడ కొన్ని సీన్స్ ల్యాగ్ అనిపిస్తాయి. కథలో ఫ్రెష్ నెస్ ఉంది. స్క్రీన్‌ప్లే కూడా ఆకట్టుకునే విధంగా ఉంది.

నటీనటుల  విషయానికొస్తే..
ఈ సినిమాకు ప్రధాన బలం శ్రీకాంత్ రెడ్డి ఆసం. యూట్యూబ్ స్టార్‌గా తనకు సంపాదించిన అనుభవంతో ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచాడు.  అంతేకాదు నిర్మాతగా.. దర్శకుడిగా..స్టంట్ మాస్టర్ గా.. హీరోగా ఫస్ట్ సినిమాతోనే ఎన్నో పాత్రలను తన భుజాలపై మోసాడు. హీరోయిన్ చంద్రశిఖా క్యూట్‌గా గ్లామరస్ గా  కనిపించింది.రాకీ సింగ్, చంద్రశిఖా శ్రీవాస్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

రేటింగ్: 2.75 / 5

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

Trending News