Hydra demolishes in Madhapur: హైదరాబాద్ లో.. హైడ్రా అక్రమ నిర్మాణాల కట్టడాల కూల్చివేతల్ని నిర్వహిస్తుంది. ఈ క్రమంలో వీకెండ్ వచ్చిందంటూ అక్రమార్కులు భయపడిపోతున్నారు. ప్రస్తుతం హైడ్రా.. మాదాపూర్, బోరబండ, బాచుపల్లి, అమీన్ పూర్ లలో ఏకకాలంలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తుంది. అదే విధంగా.. సున్నం చెరువు, కత్వా చెరువు పరిధిలోని పలు ఆక్రమణల కూల్చివేత కార్యక్రమం చేపట్టింది. స్థానిక పోలీసుల సహాయంతో బందోబస్తు చేపట్టి.. మరీ కూల్చివేతలు చేపట్టింది.
బ్రేకింగ్ న్యూస్
మాదాపూర్ సున్నం చెరువు దగ్గర ఉదిత్త పరిస్థితి
ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి దిగిన హైడ్రా నిరుపేద బాధితులు
అడ్డుకొని అరెస్ట్ చేస్తున్నమాదాపూర్ పోలీసులు https://t.co/I0F2sSEvdQ pic.twitter.com/OwIPR6mAYm
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2024
దీంతో పెద్ద ఎత్తున భవన నిర్మాణ దారులు అక్కడికి చేరుకున్నారు. తాము ఎంతో కష్టపడి ఈ ఇళ్లను కొనుక్కున్నామని, తమను అన్యాయం చేయడం ఏంటని కూడా స్థానికులు ప్రశ్నిస్తున్నారు. డబ్బులున్న వారిని, రాజకీయనాయకుల్ని వదిలేసి.. పేదల మీద మీ ప్రతాపం ఏంటని కూడాఆవేధన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది ఏకంగా ఒంటి మీద కిరోసిన్ పోసుకుని కూల్చివేతలకు అడ్డుపడ్డారు. దీంతో అక్కడ ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
రంగంలోకి దిగిన పోలీసులు వారి చేతిలో నుంచి కిరోసిన్ డబ్బాల్ని లాక్కున్నారు. శేరిలింగంపల్లి నియోజక వర్గం, మాదాపూర్ లో సున్నం చెరువు దగ్గరు కూల్చివేతల దగ్గర ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి . తమ ఇళ్లనిర్మాణాల్ని వెంటనే ఆపేయాలని కూడా స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
హైడ్రా కూల్చివేతలతో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్న పేదలు
మాదాపూర్ సున్నం చెరువులో నిర్మాణాల కూల్చివేతపై స్థానికుల ఆగ్రహం. https://t.co/0YR4SE4eDZ pic.twitter.com/Fgq2XslgvQ
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2024
అంతేకాకుండా.. కిరోసిన్ పోసుకుని మరీ తమ బాధను చెప్పుకున్నారు. ఎంతో కష్టపడి కొనుక్కున్న ఇళ్లని.. అమ్మిన వాళ్లను, పర్మిషన్ ఇచ్చిన వాళ్లను వదిలేసి.. పేదల మీద రేవంత్ ప్రతాపం ఏంటని.. కూడా స్థానికులు నిలదీస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.