Telangana Congress: ఆ విషయంలో పంతం నెగ్గించుకున్న రేవంత్.. మధుయాష్కీకి కీలక పదవి..

Telangana Congress: ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌కు కొత్త సారథిని నియమించింది తెలంగాణ కాంగ్రెస్. దాదాపు రెండు నెలల పాటు కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది.తెలంగాణకు పీసీసీ చీఫ్‌గా మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ను ప్రకటించింది. టీపీసీసీ విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి పంతం నెగ్గించుకున్నారా..! సీనియర్లు వద్దన్నా.. మహేశ్‌ వైపే అధిష్టానం ఎందుకు మొగ్గుచూపింది. మరి మధుయాష్కీ గౌడ్‌కు ఏ పదవి ఇవ్వబోతున్నారు..!

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 8, 2024, 09:20 AM IST
Telangana Congress: ఆ విషయంలో పంతం నెగ్గించుకున్న రేవంత్.. మధుయాష్కీకి కీలక పదవి..

Telangana Congress: తెలంగాణ పీసీసీ(ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) చీఫ్‌ నియామకంపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ కాంగ్రెస్ సారథిగా మహేష్ కుమార్ గౌడ్ పేరును హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది. ఎవరైతే పార్టీని సమన్వయం చేయగలరు అని విస్తృత అభిప్రాయ సేకరణ అనంతరం అధిష్టానం.. మహేష్ కుమార్ గౌడ్ కు పార్టీ పగ్గాలు అప్పగించినట్టు తెలిసింది. ఈ విషయంలో సీనియర్ల ప్రతిపాదనను పార్టీ పెద్దలు పక్కన పెట్టినట్టు సమాచారం. సీఎం రేవంత్‌ రెడ్డి మొదటి నుంచి ప్రతిపాదించిన మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ వైపే అధిష్టానం మొగ్గు చూపినట్టు ఢిల్లీ వర్గాల టాక్‌. టీపీసీసీ ఎంపిక విషయంలో తొలి నుంచి సీఎం రేవంత్ రెడ్డి మహేష్‌ కుమార్‌ వైపే నిలుచున్నారు. ఒకవేళ ఆయన్ను కాదంటే బలరాం నాయక్‌కు ఇవ్వాలని ప్రతిపాధించినట్టు టాక్‌. అయితే ముఖ్యమంత్రి సూచించిన విధంగా మహేశ్‌ కుమార్‌కే టీపీసీసీ బాధ్యతలు అప్పగించడంతో సీఎం రేవంత్ అధిష్టానం దగ్గర తన పంతం నెగ్గించుకున్నారనే టాక్‌ వినిపిస్తోంది.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నియామకంపై గత మూడు నెలలుగా సస్పెన్స్‌ నడిచింది. ఈ విషయంలో సీఎం రేవంత్‌ తో పాటు.. మిగతా మంత్రులు చాలాసార్లు ఢిల్లీకి వెళ్లి తమ అభిప్రాయాలు పార్టీ పెద్దలకు వినిపించారు. ఇక టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయాన్ని అధిష్టానం కోరగా.. బీసీ సామాజిక వర్గం నుంచి మహేష్ కుమార్ గౌడ్, ఎస్టీలకు ఇవ్వాలని భావిస్తే ఎంపీ బలరాం నాయక్ కు ఇవ్వాలని తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు  తెలిసింది. అయితే, ఉత్తమ్ కుమార్ నేతృత్వంలోని పలువురు సీనియర్ నేతలు మాత్రం అదే బీసీ సామాజిక వర్గానికి చెందిన మధుయాష్కీ గౌడ్ పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. సీనియర్ నేత మధుయాష్కీకి పార్టీ పగ్గాలు అప్పగిస్తే పార్టీలో మరో పవర్ సెంటర్ అవుతారని.. మహేష్ కుమార్ గౌడ్ పేరును రేవంత్ రెడ్డి ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది.

రేవంత్ పీసీసీ పగ్గాలు చేపటిన మొదట్లో..సీనియర్ , రేవంత్ వర్గం నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగిన సమయంలో.. వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ పార్టీని సమన్వయం చేయడం ఆయనకు తాజాగా కలిసి వచ్చిన అంశంగా చెబుతున్నారు. కొద్దిరోజులుగా పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరదించడంతో.. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ కూడా ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డిల తర్వాత నాల్గో పీసీసీ ఛీప్ గా నియమితులయ్యారు మహేష్ కుమార్ గౌడ్.

ఇక టీపీసీసీ రేసులో చివరి వరకు నిలిచిన మధుయాష్కీ గౌడ్‌కు మరో పదవి దక్కడం ఖాయమని గాంధీభవన్‌ వర్గాలు అంటున్నాయి. మధుయాష్కీ గౌడ్‌కు ఏఐసీసీలో పెద్ద పదవి రాబోతుందంటూ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని గాంధీ భవన్‌ వర్గాలు అంటున్నాయి. మొత్తంగా పీసీపీ చీఫ్‌గా మహేష్ కుమార్‌ గౌడ్‌ పేరును ప్రకటించడంతో.. మంత్రివర్గంలో ప్లేస్‌ కోసం మరికొందరు నేతలు లాబీయింగ్‌ మొదలు పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News