Kushboo: కుష్బూ ఒకప్పటి దక్షిణాది అగ్ర హీరోయిన్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది . అంతేకాదు స్త్రీ సాధికారికత కోసం ఎలిగెత్తి చాటుతూ వార్తల్లో వ్యక్తిగా నిలిచింది.. ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తున్న ఈమె చిన్నపుడు 8 యేళ్ల వయసులో తన తండ్రి తనను ఎలా లైంగికంగా వేధించిన విషయాన్ని ప్రస్తావించి మరోసారి వార్తల్లో నిలిచింది.
గత కొన్నేళ్లుగా మహిళలు లైంగి వేధింపుకుల గురవుతున్నారు. అది ఆఫీసు, ఇల్లు అనే తేడా లేకుండా మహిళలు అన్ని చోట్ల లైంగింకగా ఏదో రకంగా వేధింపబడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. రీసెంట్ గా కోల్ కత్తాలో ఓ మెడికోను అత్యంత దారుణంగా మానభంగం చేసి చంపేసిన ఘటన తనను కలిచివేసిందన్నారు.
ఈ సందర్బంగా చిన్నపుడు తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల విషయాన్ని ప్రస్తావించారు. చిన్నప్పటి నుంచే తనను తన తండ్రి లైంగికంగా వేధించిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. ఎనిమిదేళ్ల వయసు నుంచే తనను లైంగికంగా వేధించిన విషయాన్ని ప్రస్తావించారు. కాస్త పెద్దయ్యాక తన తండ్రిని ఎదిరించిన విషయాన్ని ప్రస్తావించింది.
అంతేకాదు కుష్పూ 16 యేళ్ల వయసులో ఆయన తండ్రి తమను వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కనబడలేదని చెప్పారు. కుష్బూ చిన్నపుడు తనకు జరిగిన ఈ అన్యాయం గురించి పలు ఇంటర్వ్యూలో ఎన్నోసార్లు ప్రస్తావిస్తూ ఉంది. మరోసారి కోల్ కతా మెడికో ఉదంతంతో మరోసారి వార్తల్లో నిలిచింది.
కుష్బూ విషయానికొస్తే..ఓ ముస్లిమ్ ఫ్యామిలీలో జన్మించిన కుష్బూ.. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసింది.. ఆ తర్వాత వెంకటేష్ హీరోగా నటించిన ‘కలియుగ పాండవులు’ సినిమాతో కథానాయికగా పరిచయమై ఇక వెనుదిరిగి చూసుకోలేదు.
అంతేకాదు నటిగా తమిళుల ఆరాధ్య నటిగా వాళ్లు గుడి కట్టించుకునే రేంజ్ కు ఎదిగింది. అంతేకాదు తన తోటి దర్శకుడు, నటుడు అయిన సుందర్ ను ప్రేమ వివాహాం చేసుకుంది.
సినిమాల్లో రాజకీయ రంగ ప్రవేశం చేసారు కుష్బూ. 2010లో డిఎంకే పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కుష్బూ.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంది. ఆ తర్వాత పార్టీ సిద్ధాంతాలు నచ్చక బీజేపీలో చేరింది. అంతేకాదు ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్ లో ఈమె ఓ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహిస్తోంది.