Lata Mangeshkar: లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల కీలక ప్రకటన..

Lata Mangeshkar health update : లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని అనూష శ్రీనివాసన్ ఖండించారు. అలాంటి వార్తలను నమ్మవద్దని కోరారు. ప్రస్తుతం లతా మంగేష్కర్ ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 22, 2022, 05:34 PM IST
  • ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లతా మంగేష్కర్
  • ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని వైద్యుల ప్రకటన
  • లతా మంగేష్కర్ ఆరోగ్యంపై వదంతులు నమ్మవద్దన్న ఆమె ప్రతినిధి
Lata Mangeshkar: లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల కీలక ప్రకటన..

Lata Mangeshkar health update : ప్రముఖ గాయని, భారతరత్న లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిపై ఆమెకు చికిత్స అందిస్తున్న వైద్య బృందం కీలక ప్రకటన విడుదల చేసింది. లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని స్పష్టం చేసింది. ప్రస్తుతం లతా మంగేష్కర్‌కు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. లతా మంగేష్కర్ అధికార ప్రతినిధి ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి.

లతా మంగేష్కర్ (Lata Mangeshkar) కుటుంబానికి సన్నిహితురాలైన అనూష శ్రీనివాసన్ అయ్యర్ కూడా ఆమె ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. 'ఇంతకుముందు కంటే ఇప్పుడు లతా దీదీ ఆరోగ్యం మెరుగవుతోంది. డా.ప్రతీత్ సందాని నేత్రుత్వంలోని నిపుణులైన వైద్య బృందం ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. లతా జీ త్వరగా కోలుకుని ఇంటికి తిరిగి రావాలని ప్రార్థిస్తున్నాం.' అని అనూష శ్రీనివాసన్ వెల్లడించారు.

లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని అనూష శ్రీనివాసన్ ఖండించారు. అలాంటి వార్తలను నమ్మవద్దని కోరారు. ప్రస్తుతం లతా మంగేష్కర్ ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు. ఆమె త్వరగా కోలుకుని ఇంటికి రావాలని అంతా ప్రార్థించాలన్నారు. అంతకుముందు, లతా మంగేష్కర్ మేనకోడలు రచనా షా మాట్లాడుతూ.. లతా ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆమె ఒక ఫైటర్, విన్నర్ అనే విషయం మనందరికీ తెలుసునని అన్నారు. లతా ఆరోగ్యం మెరుగవాలని ప్రార్థిస్తున్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.

కాగా, ఈ నెల 8న లతా మంగేష్కర్ (Lata Mangeshkar) కరోనా బారినపడ్డారు. కరోనా లక్షణాలు బయటపడటంతో టెస్టులు చేయించుకోగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అప్పటినుంచి ఆమె ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. లతా మంగేష్కర్ త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు ప్రార్థిస్తున్నారు.

Also Read: Video: ఈ డాగ్ నిజంగా హీరోనే.. ఆ జింక పిల్లను ఎలా కాపాడిందో చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News