KGF Actor Krishna G Rao passed away due to Severe Illness: కన్నడ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. పాన్ ఇండియా సినిమా కేజీఎఫ్‌లో నటించి మెప్పించిన నటుడు కృష్ణ జి రావు (71) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నేడు మృతి చెందారు. శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న కృష్ణ జి రావు బుధవారం బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో కేజీయఫ్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ హాస్యనటుడు మోహన్ జునేజా (54) కన్నుమూసిన విషయం తెలిసిందే.
కేజీఎఫ్ మొదటి భాగంలో నారాచిలోని విలన్లను హీరో యశ్ చితక్కొట్టే ఫైట్ సన్నివేశానికి ముందు కృష్ణ జి రావు అంధుడిగా కనిపిస్తారు. అంధుడు అయిన తాతను విలన్స్ చంపడానికి ప్రయత్నిస్తుండగా.. ఆయనను కాపాడడానికి రాఖీ భాయ్ రంగంలోకి దిగుతాడు. ఆ సన్నివేశంతో రాఖీభాయ్ పవరేంటో అక్కడున్న అందరికీ తెలుస్తుంది. కేజీఎఫ్ సినిమాలో కృష్ణ జి రావు నిడివి తక్కువే అయినప్పటికీ.. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఆయన చాలా ఫేమస్ అయ్యారు.
KGF actor Krishna G Rao passes away. He was hospitalized following severe illness#Sandalwood #KGF2 #KFI #sandalwoodactors pic.twitter.com/gTWdWi0ECa
— Bangalore Times (@BangaloreTimes1) December 7, 2022
కేజీఎఫ్ అనంతరం కృష్ణ జి రావుకు చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి. ఆయన ప్రధాన పాత్రలో ఇటీవలే ఓ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఇంతలోనే కృష్ణ కన్నుమూశారు. కృష్ణ జి రావు మల్టీ టాలెంటెడ్. అసిస్టెంట్ డైరెక్టర్, ప్రొడక్షన్ మేనేజర్, కథా రచయితగా పేరు తెచ్చుకున్నారు. కేజీఎఫ్ సినిమా కోసం ఓ ఫొటో పంపించమని కృష్ణని ప్రొవిజనల్ మేనేజర్ కుమార్ కోరారు. స్క్రిప్ట్ రైటింగ్‌లో బిజీగా ఉండటంతో.. ఆయన లైట్ తీసుకున్నారు. అయితే మేనేజర్ స్వయంగా కృష్ణ ఫొటోను కేజీఎఫ్ ఆడిషన్స్‌కు పంపారు. దీంతో ఆయన సెలక్ట్ అయ్యారు. కృష్ణ మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Waltair Veerayya Release Date: ఇట్స్ అఫీషియల్.. సంక్రాంతికే 'వాల్తేరు వీరయ్య'! పోస్టర్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.