Keerthy Suresh: కీర్తి సురేష్ కి ప్రేమలేఖ.. ఆ అబ్బాయి గురించి బయట పెట్టిన హీరోయిన్

Keerthy Suresh Love: మహానటి మూవీ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిన హీరోయిన్ కీర్తి సురేష్.ఇక ఈ మూవీ తర్వాత గ్లామర్ డోస్ పెంచేసిన  కీర్తి సురేష్ కు యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందంతో పాటు ఆకట్టుకునే నటన, చలాకితనం ఈ ముద్దుగుమ్మ కు ఎక్కడలేని ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 12, 2024, 01:39 PM IST
Keerthy Suresh: కీర్తి సురేష్ కి ప్రేమలేఖ.. ఆ అబ్బాయి గురించి బయట పెట్టిన హీరోయిన్

Keerthy Suresh: టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో.. గ్లామర్ పాత్రలు అందరూ చేస్తారు కానీ కొన్ని పాత్రలు మాత్రం కొందరు మాత్రమే చేయగలుగుతారు. అలాంటి పాత్రలలో మహానటి సావిత్రి పాత్ర ఒకటి. నేటి తరం హీరోయిన్ అయి ఉండి కూడా కీర్తి సురేష్ మహానటి సినిమాలో సావిత్రి పాత్రకి జీవం పోసి..ఆ సినిమాలో తన అద్భుతమైన నటనతో నిజంగా మహానటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ తర్వాత కొన్ని గ్లామరస్ పాత్రలు కూడా చేసి యూత్ లో ఫాలోయింగ్ . సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే కీర్తి సురేష్ పెట్టిన ఫోటోలకి కాంప్లిమెంట్ల వర్షం కురవడం కామన్.

మరి ముఖ్యంగా బాయ్స్ లో కీర్తికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు .ఆమె ఒక్క ఫోటో పెట్టిందంటే చాలు .. రెస్పాన్స్ గా వేల‌ల్లో ప్ర‌పోజ‌ల్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ మనం ఎప్పుడూ చూసేవే. అయితే కీర్తి కెరీర్ లో ఒక వినూత్నమైన ప్రపోజల్ జరిగింది అన్న విషయం మనలో చాలామందికి తెలియదు. ఈ విషయాన్ని కీర్తి సురేష్ స్వయంగా వెల్లడించడం విశేషం.అతను ఎవరో కానీ కీర్తి సురేష్ కి ఇంటి అడ్రస్ తో సహా మొత్తం డీటెయిల్స్ ఇచ్చి మరి ప్రపోజ్ చేశాడట.

అసలు విషయం ఏమిటంటే.. కొన్ని రోజుల క్రితం కీర్తి సురేష్ ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఓపెనింగ్ కి వెళ్ళింది. కీర్తి సురేష్ లాంటి హీరోయిన్ ని డైరెక్ట్ గా చూసి అవకాశం ఎవరు వదులుకుంటారు చెప్పండి.. అందుకే ఆమె వస్తుంది అనేసరికి ఆ ప్లేస్ ఆమె అభిమానులతో నిండిపోయింది. సడన్ గా ఆ గుంపులో నుంచి కీర్తి ముందుకు వచ్చిన ఒక అబ్బాయి.. ఆమె చేతిలో ఓ పెద్ద పుస్తకం తెచ్చి పెట్టాడట. ఆమెకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా కేవలం ఆమె చేతిలో బుక్కు పెట్టి వెళ్లిపోయాడట ఆ అబ్బాయి.

ఆ పుస్తకంలో కీర్తి సురేష్ కు సంబంధించిన ఫోటోలతో పాటు ఒక ఉత్తరం కూడా ఉంది. ఆ ఉత్తరంలో ఆమెపై తనకు ఉన్న ప్రేమను ఎక్స్ ప్రెస్ చేస్తూ.. అబ్బాయి తన ఫోటోతో పాటు ఇంటి అడ్రస్ ,ఫోన్ నంబర్ లాంటి వివరాలు అన్నీ రాసి ఇచ్చాడు. ఆ లెటర్ చదివి షాక్ అయిన కీర్తి కాసేపటి తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుకుందట. అది తన ఫస్ట్ లవ్ లెటర్ కావడంతో ఇప్పటికి కూడా భద్రంగా దాచుకున్నట్టు కీర్తి వెల్లడించండి. ఆ లెటర్ ఆమెకి ఎంతో స్పెషల్ అని కూడా అంది.

Also Read: Miscarriage: గర్భం కోల్పోయిన భార్య.. కన్నీటిసంద్రంలో మునిగిన స్టార్‌ క్రికెటర్‌

Also Read: Transgender: అవమానాలనే మెట్లుగా చేసుకుని ఎదిగిన ట్రాన్స్‌జెండర్‌.. ఈ కథ స్ఫూర్తిదాయకం

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News