Keerthy Suresh: షారుఖ్ సాంగ్ కు కీర్తి సురేష్ అదిరిపోయే స్టెప్పులు, వీడియో వైరల్

Keerthy Suresh: షారుఖ్-అట్లీ కాంబోలో తెరకెక్కిన జవాన్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా ఈ మూవీలోని సాంగ్ కు స్టెప్పులేశారు స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 14, 2023, 01:45 PM IST
Keerthy Suresh: షారుఖ్ సాంగ్ కు కీర్తి సురేష్ అదిరిపోయే స్టెప్పులు, వీడియో వైరల్

Keerthy Suresh Dancing Shah Rukh Khan Song: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌ (Shah Rukh Khan) నయా మూవీ 'జవాన్' థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. అట్లీ (Atlee) దర్శకత్వం వహించిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సెప్టెంబరు 07న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఊహించని రేంజ్ లో కలెక్షన్స్ వస్తున్నాయి. వారం రోజుల్లోనే ఈ మూవీ రూ.650 కోట్లు కొల్లగొట్టింది. రిలీజైన వారం రోజుల్లోనే 600 కోట్లు మార్క్ ను అందుకున్న తొలి హిందీ సినిమాగా ఇది నిలిచింది. ఈ మూవీలో షారుఖ్ నటనకు ఆడియెన్స్ నుంచి కాకుండా ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. ఇందులో రాజమౌళి, మహేశ్ బాబు, అల్లు అర్జున్ వంటి వారు ఉన్నారు. 

ఈ మూవీలోని ‘చలేయా’(Chaleya) అనే సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. ఈ సాంగ్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. ఈ పాటకు డ్యాన్స్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు పలువురు.తాజాగా ఈ సాంగ్ కు మహానటి కీర్తి సురేష్, అట్లీ (Atlee) సతీమణి ప్రియ మోహ‌న్ (Priya Mohan) స్టెప్పులేశారు. ఈ డ్యాన్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో అట్లీ త‌న పెట్‌తో క‌నిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అట్లీ ఫ్యామిలీతో కీర్తి సురేష్‌కు మొద‌టి నుంచి మంచి రిలేషన్ ఉన్న సంగతి తెలిసిందే. 

జవాన్ సినిమాలో షారుక్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటించారు. విజయ్ సేతుపతి, ప్రియమణి, సాన్యా మల్హోత్రా, యోగిబాబు, సునీల్ గ్రోవర్ తదితరులు కీలకపాత్రల్లో నటించి మెప్పించారు. దీపికా పదుకొనె, సంజయ్ దత్ గెస్ట్ రోల్స్ లో మెరిశారు. అనిరుధ్ అందించిన సంగీతం ప్రేక్షకులను ఫిదా చేసింది.  ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ నిర్మించారు. 

Also Read: Jawan OTT Release Update: దిమ్మతిరిగే రేటుకు జవాన్ ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News