Kalki 2898 AD Trailer: సలార్, ఆదిపురుష్ విజయాలతో సక్సెస్ దూకుడులో ఉన్న ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు 'కల్కి 2898 ఏడీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బుజ్జి అనే పాత్ర పరిచయంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. హాలీవుడ్ స్థాయిని మించి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ట్రైలర్‌ను చూస్తుంటే ప్రభాస్ ఖాతాలో మరో పాన్ వరల్డ్ హిట్ పడినట్టుగా కనిపిస్తోంది.
Also Read: OTT Releases: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓటీటీలో వచ్చేసింది, ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే
ఈ సినిమాలో ప్రభాస్ భైరవ పాత్రలో నటిస్తుండగా.. అతడికి జోడీగా దీపిక పదుకొనే మెరుస్తోంది. ఈ సినిమాలో మరో కీలక పాత్ర బుజ్జి. ఇటీవల బుజ్జి పరిచయ కార్యక్రమం భారీ స్థాయిలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో భైరవ పాత్రదారి తమ సమాజాన్ని రక్షించేందుకు పోరాడే యోధుడిగా కనిపిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్ ప్రభాస్‌ను కాపాడే పాత్రలో ఉన్నట్టు తెలుస్తోంది. 3.03 నిమిషాల పాటు ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తోంది. హాలీవుడ్ స్థాయిలో ఉన్న ఈ ట్రైలర్‌లో అంతం కాబోతున్న తమ సమాజాన్ని కాపాడుకోవడమే ఇతివృత్తంగా సినిమా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Kalki2898AD: కల్కిలో దీపిక పడుకొనే పరిస్థితి కూడా చివరికి అంతేనా! కంగారులో ఫ్యాన్స్..
'ఈ భూమ్మీద మొదట నగరం.. ఈ ప్రపంచంలో చివరి నగరం కాశీ. భూమిని చీల్చేస్తే అంతటా నీళ్లు' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. 6 వేల సంవత్సరాల కిందట కనిపించిందనిది మళ్లీ కనిపించింది అని చెబితే 'ఇక వెలుగు వచ్చే సమయమైంది' అని రాజేంద్ర ప్రసాద్ చెబుతాడు. 'ప్రాణంలో ఇంకో ప్రాణం. నువ్వు ఇప్పుడు కనబోయేది మామూలు ప్రాణం కాదు. సృష్టిని. దీన్ని నేను కాపాడుతా' అని తొలి భాగం ప్రారంభమవుతుంది.
'పొద్దు పొద్దున్నే ఫైట్ ఏమిటి బుజ్జి' అంటూ ప్రభాస్ ప్రవేశిస్తాడు. యూనిట్స్ కోసం ఈ సినిమాలో పోరాడుతూ కనిపించాడు. 'ప్రపంచంలో ఒకటే ఒక సైడ్. నీ సైడ్' అనే డైలాగ్ ఆకట్టుకుంది. 'రికార్డ్స్ చూసుకో ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. ఇది కూడా ఓడిపోను' అని ప్రభాస్ చెప్పిన డైలాగ్ తన సినీ రికార్డ్స్‌ను గుర్తు చేసింది. 'భయపడకు మరో ప్రపంచం వస్తుంది' అనే డైలాగ్‌తో ట్రైలర్ ముగుస్తుంది. బ్రహ్మానందం ఉండడంతో కొంత వినోదం కూడా ఉండే అవకాశం ఉంది.
రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, పశుపతి, అన్నాబెన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. బుజ్జి పాత్రకు మహానటి హీరోయిన్ కీర్తి సురేశ్ డబ్బింగ్ చెప్పింది. సంగీతం సంతోష్ నారాయణన్ అందించగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్‌లు ఇచ్చారు. ఈ సినిమాను వైజయంతి మూవీస్ వాళ్లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. చూడడానికి భారీ స్థాయిలో ఉన్న ఈ సినిమా తెలుగు పరంగా కొంత ఇబ్బందిగా ఉంది. అర్థం కాని రీతిలో తెలుగు భాష ఉందని తెలుగు ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు. అక్కడక్కడ కేజీఎఫ్ ఆనవాళ్లు గుర్తుకు వస్తున్నాయి. ఈ సినిమా జూన్ 27వ తేదీన విడుదల కానుంది.
Kalki 2898 AD Trailer: రికార్డ్స్ చూసుకో ఇది కూడా ఓడిపోను.. కల్కి 2898 ఏడీ ట్రైలర్ చూస్తే గూస్‌బంప్స్