Kajal Aggarwal: రిపీట్ కానున్న ఆచార్య ఎఫెక్ట్.. కాజల్ అభిమానులకు తప్పని నిరాశ!

Kajal Agarwal in Indian 2: కాజల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. చందమామ సినిమాతో.. నిజంగానే తెలుగు ప్రేక్షకుల మధ్యలో చందమామల మిగిలిపోయింది ఈ హీరోయిన్. ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న కాజల్.. కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ సినిమాలతో వరసగా బిజీగా ఉంది..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 9, 2024, 07:19 PM IST
Kajal Aggarwal: రిపీట్ కానున్న ఆచార్య ఎఫెక్ట్.. కాజల్ అభిమానులకు తప్పని నిరాశ!

Kajal Agarwal in Indian 3: కళ్యాణ్ రామ్.‌ లక్ష్మీ కళ్యాణం.. సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ కాజల్. చందమామ సినిమాతో నిజంగానే తెలుగు ప్రేక్షకుల మదిలో.. చందమామలా మిగిలిపోయింది. ఆ తరువాత నుంచి కాజల్ కి తిరిగి చూసుకోవలసిన.. అవసరం రాలేదు. తెలుగులో వరస అవకాశాలు అందుకుంటూ.. సార్ హీరోలతో.. సినిమాలు చేస్తూ దూసుకుపోయింది.

కొద్ది సంవత్సరాల క్రితమే పెళ్లి చేసుకున్న కాజల్.. ఆ తరువాత కొద్ది రోజులకు తల్లి కావటంతో సినిమాలకు..కొంచెం గ్యాప్ తీసుకుండి. అయితే మళ్లీ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా.. ఉండి ఈ హీరోయిన్. కాగా కాజల్ పెళ్లి చేసుకున్న తరువాత.. ఆచార్య సినిమాలో నటించింది. చిరంజీవి హీరోగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ పరిస్థితి పక్కన పెడితే.. ఈ సినిమా కాజల్ అభిమానులకు తీవ్ర నిరాశ మిగిల్చింది. అందుకు ముఖ్య కారణం ఈ సినిమాలో హీరోయిన్ కాజల్ అని చెప్పిన.. చిత్రంలో ఒక్క కాజల్ సీన్ కూడా లేకపోవడం. 

ఏమైందో ఏమో తెలియదు కానీ.. సినిమా షూటింగ్ మొత్తం అయ్యాక.. కాజల్ సీన్స్ వరకు ఈ చిత్రంలో తీసేశారు. దాంతో సినిమా విడుదలయ్యాక.. ఈ చిత్రంలో ఎక్కడా కూడా కాజల్ కనిపించలేదు. దాంతో అప్పట్లో కాజల్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక ఇప్పుడు.. మరోసారి కాజల్ అభిమానులకు అదే పరిస్థితి ఎదురుకానుంది. శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఇండియన్ 2 సినిమాలో.. కాజల్ హీరోయిన్ గా నటిస్తోందని.. అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం జూలై 12న విడుదల కానుంది. అయితే ఇప్పుడు కూడా మరోసారి.. కాజల్ అభిమానులకు నిరాశ తప్పేలా లేదు. 

ఇందుకు ముఖ్య కారణం ఈ చిత్రంలో కూడా కాజల్ కేవలం ఒక్క సీన్ లో.. కూడా కనిపించదని ముందుగానే చిత్ర బృందం తెలియచేయడం. ఈ సినిమాకి సీక్వెల్ గా ఇండియన్ 3.. త్వరలో రాబోతోంది. కాగా.. ఇండియన్ 3 లో మాత్రమే కాజల్ కనిపించనుందట. దీంతో ఇండియన్ 2 కోసం.. ఎదురుచూసిన కాజల్ అభిమానులకు.. మరోసారి ఆచార్య ప్రభావం తప్పలేదు. మొత్తానికి ఈ రెండు ప్రాజెక్ట్స్ తో ఆమె అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ షాక్ ఇచ్చింది కాజల్. కాగా ఈ మధ్య కాజల్ నటించిన సత్యభామ సినిమా కూడా కేవలం.. పరవాలేదు అనిపించుకుంది. ఈ క్రమంలో కాజల్ ఏదైనా.. ఒక బ్లాక్ బస్టర్.. అందుకోవడం తప్పనిసరిగా కనిపిస్తోంది.

Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..

Read more:Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News