Kajal Agarwal: ఢీ రేస్ టూ ఫినాలేలో కాజల్ సందడి.. చందమామని ఆటపట్టించిన హైపర్ ఆది

Dhee Finale: కాజల్ త్వరలోనే సత్యభామ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో తెగ యక్టివ్ గా పాల్గొంటుంది ఈ హీరోయిన్. ఇందులో భాగంగా ఢీ రేస్ టూ ఫినాలే కి కాజల్ వచ్చి తెగ సందడి చేసింది..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 21, 2024, 02:30 PM IST
Kajal Agarwal: ఢీ రేస్ టూ ఫినాలేలో కాజల్ సందడి.. చందమామని ఆటపట్టించిన హైపర్ ఆది

Kajal in Dhee Finale Promo: పెళ్లి చేసుకొని కొద్ది రోజులు గ్యాప్ తీసుకున్న కాజల్ ఈ మధ్యనే బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా వస్తున్న ఇండియన్ 2 సినిమా షూటింగులో బిజీగా ఉంది.  మరోపక్క కాజల్ ప్రధాన పాత్రలో రానున్న సత్యభామ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ప్రమోషన్స్ లో తెగ ఆక్టివ్ గా పాల్గొని ఈ చందమామ. ఈ క్రమంలో ఈ మధ్యనే ఢీ షోకి కూడా అటెండ్ అయ్యింది.

బుల్లితెరపై ఢీ షో క్రియేట్ చేసిన సంచలనాలు అందరికీ తెలిసిందే. డ్యాన్సింగ్ షోల్లో ఢీకి ఉండే ప్రత్యేక స్థానం గురించి చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమయ్యే ఢీలో 17వ సీజన్ నడుస్తోంది. ఈ సీజన్ కూడా ముగింపు దశకి వస్తూ ఉండటంతో.. రేస్ టూ ఫినాలే ఎపిసోడ్ జరగనుంది. రేపటి బుధవారం నాడు ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌లో కాజల్ అగర్వాల్ సందడి చెయ్యబోతోంది. ఇందుకు సంబంధించిన ప్రోమో ఆల్రెడీ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది. హైపర్ ఆది, కాజల్ అగర్వాల్‌ల కామెడీ, ఈ ఇద్దరూ పాడిన పాట, శేఖర్ మాస్టర్‌తో కలిసి బంతిపూల జానకీ అంటూ కాజల్ వేసిన స్టెప్పులు ప్రోమోకే హైలెట్ అయ్యాయి. 

ముందుగా హైపర్ ఆది.. అక్టోబర్ 30 కాజల్ పెళ్ళి రోజు కదా అని అడగగా.. దానికి కాజల్ అవును అనింది వెంటనే హైపర్ ఆది అది తన డెత్ డేట్ అని జోక్ వేశారు. ఇక ఆ తరువాత పెళ్లికి ముందు కాజల్ పైన ఎన్నో కవితలు రాసుకున్నానని కానీ కాజల్ పెళ్లి తర్వాత కాజల్ భర్త కిచులు వల్ల బలైపోయానని అని చెప్పకువచ్చారు. ఇక కొన్ని పర్ఫామెన్స్ ల తర్వాత కాజల్ శేఖర్ మాస్టర్ తో కలిసి బంతిపూల జానకి సాంగ్ కి స్టెప్పులు వేసి అదరగొట్టింది.

ఈ ఎపిసోడ్‌లో నాలుగు గ్రాండియర్ పర్ఫామెన్స్‌లు ఉంటాయి అని ఈ ప్రోమో చూస్తే అర్థమవుతోంది. శంభో శివ శంభో అంటూ ఆదర్శ్ అందరినీ మెస్మరైజ్ చేయబోతన్నారు. శ్వేతనాయుడు కాజల్‌ని ఇమిటేట్ చేసింది. వర్షిణి అర్జ ఏమో రావణాసుర ఆంథమ్‌కి డ్యాన్స్ చేసి రామాయణాన్ని చూపించింది. శ్వేతా నాయుడు, రాకీ పర్ఫామెన్స్‌లు మరింత గ్రాండియర్‌గా ఉండేలా కనిపిస్తున్నాయి. ఈ ఎపిసోడ్ తరువాత ఒకరు ఎలిమినేట్ అవుతారు. ముగ్గురు మాత్రం ఫైనల్‌కి వెళ్తారన్న సంగతి తెలిసిందే. మరి ఆ ముగ్గురు ఎవరు అనేది ఈ ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. ఈటీవీలో రేపు రాత్రి 9.30 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News