Jr NTR remuneration: ఎన్టీఆర్ పారితోషికం తిరిగిచ్చేశారా ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Jr Ntr ) 30వ చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నాడనే సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని హరిక & హాసిని క్రియేషన్స్, అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

Last Updated : Aug 23, 2020, 01:02 AM IST
Jr NTR remuneration: ఎన్టీఆర్ పారితోషికం తిరిగిచ్చేశారా ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Jr Ntr ) 30వ చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నాడనే సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని హరిక & హాసిని క్రియేషన్స్, అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. గతంలో, జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన అరవింద సమేత ( Aravinda Sametha ) బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఎన్.టి.ఆర్ 30వ ( #NTR30 ) చిత్రంలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ( Rashmika Mandanna ) ఎన్టీఆర్‌కి జోడిగా తీసుకోవడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్లాన్ చేశాడనే వార్తలు కూడా వచ్చాయి. అంతేకాకుండా ఈ సినిమా కోసం నిర్మాతలు ఎన్టీఆర్‌కి పారితోషికంలో ( Jr NTR's remuneration ) భాగంగా రూ. 8 కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చారనే టాక్ వినిపించింది. Also read : Interesting facts: వినాయక చవితి కథలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు

ఆ తర్వాత లాక్ డౌన్, కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి కారణంగా సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి. ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినప్పటికీ.. ఓవైపు కరోనావైరస్ విజృంభిస్తుండటం.. మరోవైపు ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో స్టార్ హీరోల సినిమాల షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలంటే నిర్మాతలు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ తాను తీసుకున్న అడ్వాన్స్‌ను నిర్మాతలకు తిరిగి ఇచ్చాడనే ప్రచారం జరుగుతోంది. Also read : Ganesha idols makers: గణపతినే నమ్ముకున్నాం.. ఇలా అవుతుందనుకోలేదు

ప్రస్తుతానికి సినిమా షూటింగ్ జరిగే పరిస్థితులు కనిపించకపోవడం.. మరోవైపు నిర్మాతలపై ఫైనాన్షియర్ల ఒత్తిడి, వడ్డీ భారం పెరుగుతుండటంతో వారికి తన వంతు సాయంగానే ఎన్టీఆర్ తాను తీసుకున్న అడ్వాన్స్‌ని తిరిగి ఇచ్చాడని తెలుస్తోంది. దీంతో ఈ విషయంలో ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయంపై డైరెక్టర్ త్రివిక్రమ్ ( Trivikarm ) సైతం సంతోషాన్ని వ్యక్తపరిచినట్టు టాక్ వినిపిస్తోంది. ఇదిలావుంటే, ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్‌తో ( RRR movie shooting ) బిజీగా ఉన్నారు. Also read : Rhea Chakraborty, Mahesh Bhatt: వైరల్‌గా మారిన రియా చక్రవర్తి, మహేష్ భట్ మధ్య వాట్సాప్ చాటింగ్‌

Trending News