Jhanvi Kapoor: దేవర వల్ల మరోసారి అమ్మకు దగ్గరయ్య.. శ్రీదేవి కూతురు ఎమోషనల్

Devara: జాన్వి కపూర్ తెలుగు సినిమా ఇంకా విడుదల కాకపోయినా ఆమె గురించి తెలియని వారైతే సౌత్ ఇండియాలో ఉండరు. అందుకు ముఖ్య కారణం జాన్వి కపూర్ శ్రీదేవి కూతురు కావడమే.. కాగా ప్రస్తుతం జాన్వి కపూర్ జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది.. ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ ఈ చిత్రం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 4, 2023, 12:34 PM IST
Jhanvi Kapoor: దేవర వల్ల మరోసారి అమ్మకు దగ్గరయ్య.. శ్రీదేవి కూతురు ఎమోషనల్

Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ గురించి సౌత్ ఇండియా ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. దివంగత నటి శ్రీదేవికి తెలుగువారి హృదయాలలో ఉన్నచోటు చాలా అపురూపమైనది. ఆమెని మనమందరం కూడా సౌత్ ఇండియా అతిలోకసుందరిగా చూసాము. ఇక శ్రీదేవి లేని లోటు ఎన్నో రోజులు తెలుగు ఇండస్ట్రీలో స్పష్టంగా కనిపించింది. అయితే ఇప్పుడు శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తూ ఉండటంతో శ్రీదేవి అభిమానులు సంతోషంలో ఉన్నారు.

శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవర తో మన ముందుకి రానుంది బాలీవుడ్ లో ‘దఢక్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హిందీ ఇండస్ట్రీలో వరుసగా పలు సినిమాలు ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసుకుంటూ వస్తుంది. అయితే జాన్వీకి ఇప్పటివరకు ఒక్క కమర్షియల్ హిట్ కూడా లేకపోవడంతో ఇంకా బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ ఎదగలేదు ఈ హీరోయిన్. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్టీఆర్ సరసన ‘దేవర’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది జాన్వీ కపూర్.

ఈ మధ్యనే ఈ సినిమాలో తన క్యారెక్టర్ ‘తంగం’ కి సంబంధించి ఫస్ట్ లుక్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఆల్రెడీ దేవర సినిమా రెండు షెడ్యూల్స్ లో జాన్వీ పాల్గొంది. ఇక తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ హీరోయిన్ దేవర గురించి చెబుతూ కొన్ని ఎమోషనల్ వ్యాఖ్యలు చేసింది.

జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. ‘జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తూ ఉన్న దేవర నా మొదటి తెలుగు సినిమా. నేను తెలుగులో డైలాగ్స్ నేర్చుకోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నాను. మా అమ్మ మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఇంగ్లీష్ లేదా హిందీ మాట్లాడేది. కానీ సౌత్ కు వెళ్ళినప్పుడు మాత్రం తాను సౌత్ ని తన సొంత ఇల్లు లాగా ఫీల్ అయ్యేది. అక్కడ తమిళ్, తెలుగు బాగా మాట్లాడేది. దేవర సెట్ లో అడుగుపెట్టినప్పుడు నాకు కూడా నా ఇంటికి వచ్చినట్టు అనిపించేది. దేవర సెట్ లోని ప్రతి ఒక్కరూ నాకు బాగా తెలిసిన వాళ్ళు అనిపిస్తుంది. ఎందుకో తెలీదు కానీ మా అమ్మతో నాకున్న అనుబంధం వల్ల దేవర సినిమా చేస్తుంటే అమ్మతో మరోసారి అటాచ్ అయినట్టు అనిపిస్తుంది. ఇది ఒక ఆధ్యాత్మిక అనుభూతి కూడా ఇస్తుంది' అని ఎమోషనల్ వ్యాఖ్యలు చేసింది జాన్వి కపూర్.

కాగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవరా సినిమా రెండు పార్టులుగా రాబోతోంది. ఇక ఈ సినిమా మొదటి పార్ట్ 2024 ఏప్రిల్ 5న విడుదల కానుంది అని ఈ మధ్యనే ఈ సినీమ మేకర్స్ తెలియజేశారు.

Also Read: Telangana Election 2023 Result Live: బీజేపీ విజయం సాధించిన స్థానాలు ఇవే.. కీలక నేతలు ఓటమిపాలు 

Also read: Telangana Election Results 2023: తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కారణాలేంటి

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News