Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్‌షాక్.. నేషనల్ అవార్డు రద్దు

Jani Master National Award: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ప్రకటించిన నేషనల్ అవార్డును కమిటీ సభ్యులు రద్దు చేశారు. పోక్సో కేసు నమోదు అయిన నేపథ్యంలో అవార్డును వెనక్కి తీసుకున్నారు. అవార్డు అందుకోవడం కోసం ఆయనకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.  

Written by - Ashok Krindinti | Last Updated : Oct 5, 2024, 11:12 PM IST
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్‌షాక్.. నేషనల్ అవార్డు రద్దు

Jani Master National Award: అత్యాచారం కేసులో అరెస్ట్ అయి మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మరో బిగ్‌షాక్ తగిలింది. ఆయనకు ప్రకటించిన నేషనల్ అవార్డును రద్దు చేశారు. పోక్సో కేసు నమోదు అయిన నేపథ్యంలో కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. అవార్డుకు ఎంపికైన కొద్ది రోజులకే ఆయనపై అత్యాచార ఆరోపణలు రావడంతో అరెస్టయ్యారు. అవార్డు అందుకునేందుకు జానీకి కోర్టు ఇటీవల మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. అవార్డు అందుకోకముందే రద్దు చేయడంతో జానీ మాస్టర్‌కు మరో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. నేషనల్ ఫిలిం అవార్డు ఫర్ బెస్ట్ కోరియోగ్రఫీ 2022 ఏడాదికి గాను ఎంపికైన విషయం తెలిసిందే. న్యూఢిల్లీలో అవార్డు ఫంక్షన్ కోసం మధ్యంతర బెయిల్ పొందారు.  ఈ నెల 8న అవార్డు అందుకోవాల్సి ఉండగా.. క్యాన్సిల్ చేశారు. అవార్డు రద్దు చేయడంతో బెయిల్ రద్దుపై సందిగ్ధం నెలకొంది.

అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్‌కు అవకాశాల పేరిట ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు జానీ మాస్టర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను గోవాలో అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. అయితే ఈ నెల 8న ఢిల్లీలో నేషనల్ అవార్డు అందుకోవాల్సి ఉండడంతో బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. దీంతో జానీ మాస్టర్‌కు నాలుగు రోజులపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఎవరిని ప్రభావితం చేయకూడదని కోర్టు కండీషన్స్ పెట్టింది.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు అందుకుందామనుకున్న జానీ మాస్టర్ ఆశలకు గండిపడింది. అవార్డు రద్దు చేయడంతో ఆయన బెయిల్ కూడా రద్దు చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read: Exit Poll Results 2024: హర్యానాలో బీజేపీకి భారీ ఎదురు దెబ్బ..?.. జమ్ములో అధికారంలోకి  నేషనల్స్ కాన్ఫరెన్స్..?.. ఎగ్జిట్ పోల్స్ ఏంచెబుతున్నాయంటే..?

Also Read: Tirumala Laddu Controversy : తిరుమల లడ్డుపై సుప్రీం స్పెషల్ సిట్, టెన్షన్ లో ఏపీ రాజకీయ పార్టీలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

 

Trending News