Prasanth Varma: రణవీర్ సింగ్ తో ప్రశాంత్ వర్మ గొడవ.. అసలు విషయం బయట పెట్టిన దర్శకుడు..

Prasanth Varma About Ranveer Singh: హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయారు ప్రశాంత్ వర్మ. ఈ క్రమంలో ఇప్పుడు ఈ డైరెక్టర్ రణవీర్ సింగ్ తో ఒక సినిమా చేయనున్నారని వార్తలు వచ్చాయి. కాగా ఈ చిత్రం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టారు ప్రశాంత్ వర్మ

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 28, 2024, 05:01 PM IST
Prasanth Varma: రణవీర్ సింగ్ తో ప్రశాంత్ వర్మ గొడవ.. అసలు విషయం బయట పెట్టిన దర్శకుడు..

Prasanth Varma Upcoming Movie: తేజ సజ్జ హీరోగా చేసిన హనుమాన్ సినిమాతో.. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా మంచి మార్కెట్ ఏర్పరచుకున్నారు ప్రశాంత్ వర్మ. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో పాన్ ఇండియా దర్శకుడుగా మారిపోయారు. ఇక దీంతో బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఈ డైరెక్టర్ కి ఫిదా అయిపోయి.. అతనితో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు.

ఈ క్రమంలో ప్రశాంత్ వర్మ తన తదుపరి సినిమా రణవీర్ సింగ్ తో ప్లాన్ చేస్తున్నట్టు ఎన్నో రోజుల నుంచి వార్తలు వచ్చాయి. ఇక ఆ వార్తలను నిజం చేస్తూ టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ కాంబినేషన్లో సినిమాకు సన్నాహాలు చేసింది. కాగా ఈ చిత్రానికి బ్రహ్మ రాక్షస అనే పేరు కూడా పెట్టనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.  ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తెరకెక్కించబోతున్నారు అని వినికిడి.

అయితే ఈ మధ్య ఈ చిత్రం కోసం ఒక రిహార్సల్ షూట్ లాంటిది చేశారని.. అందుకోసం చాలా భారీగా ఖర్చయిందని.. ఐతే ఔట్‌పుట్‌తో పాటు.. ప్రశాంత్ పనితీరు.. రణ్వీర్ సింగ్ కి  నచ్చకపోవటంతో..ఈ సినిమా నుంచి ఈ హీరో తప్పుకున్నాడని.. దీంతో మైత్రీ సంస్థకు భారీ నష్టం వాటిల్లిందని.. జోరుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

కానీ ఈ రూమర్స్ పైన పూర్తి వివరణ ఇవ్వకుండా.. కేవలం ఈ ప్రాజెక్టు ఉంటుందని మాత్రం మైత్రీ సంస్థ.. ఈ మధ్యనే స్పష్టం చేసింది. అయితే ప్రశాంత్ వర్మ ఆ రూమర్స్ గురించి ఫైనల్ గా స్పందించారు. అసలు తనకు రణవీర్ సింగ్ కి మధ్య ఎటువంటి డిఫరెన్స్ రాలేదని చెప్పుకొచ్చాడు. రణ్వీర్ సింగ్‌తో తన సినిమా పక్కాగా ఉంటుందని అతను స్పష్టం చేశాడు. ఈ సినిమా గురించి నిరాధారమైన వార్తలు రాశారని.. ఈ గాసిప్స్ ఎవరు పుట్టించారో తనకు అర్థం కావడం లేదని, అయినా ఇలాంటి వాటిని తాను పట్టించుకోనని ప్రశాంత్ వర్మ తెలిపాడు.

రణవీర్ సింగ్ తో తాము చేసింది జస్ట్ లుక్ టెస్ట్ మాత్రమే అని.. అది కూడా సంతృప్తికరంగానే వచ్చిందని.. కాబట్టి నూటికి నూరు శాతం ఈ సినిమా ముందుకు సాగుతుందని ప్రశాంత్ వర్మ స్పష్టం చేశారు.

Read more: Snakes facts: ప్రపంచంలోనే అత్యంత స్పీడ్ గా వెళ్లే పాములు.. ఇవి చాలా డెంజర్ భయ్యా.. డిటెయిల్స్ ఇవే..

Read more: Snake: వామ్మో.. ఫ్యాన్ మీద ప్రత్యక్షమైన భయంకరమైన పాము.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News