Prabhas Salaar: ప్రభాస్ 'సలార్' మూవీ నుంచి క్రేజీ అప్డేట్...రాజమనార్​గా జగ్గు భాయ్

Prabhas Salaar: భారీ యాక్షన్ ఎంటర్​టైనర్​గా తెరకెక్కుతున్న 'సలార్​' మూవీ నుంచి కొత్త అప్ డేట్ వచ్చేసింది. ఇందులోని కీలకపాత్రను పరిచయం చేసింది చిత్రబృందం. రాజ​మనార్​గా జగపతిబాబు లుక్ ను విడుదల చేసింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 23, 2021, 02:45 PM IST
  • ప్రభాస్ 'సలార్' మూవీ నుంచి క్రేజీ అప్ డేట్
  • రాజమనార్​గా జగపతిబాబు లుక్ విడుదల
  • కీలకపాత్రలో శ్రుతిహాసన్
Prabhas Salaar: ప్రభాస్ 'సలార్' మూవీ నుంచి క్రేజీ అప్డేట్...రాజమనార్​గా జగ్గు భాయ్

Prabhas Salaar: డార్లింగ్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న తాజా చిత్రం సలార్. ఈ మూవీ నుంచి కీలక అప్ డేట్ వచ్చేసింది. ప్రశాంత్ నీల్ (Director Prashant Neil) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అప్ డేట్స్ గురించి సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 ఈ క్రమంలోనే సోమవారం ఉదయం సలార్‌(Salaar)’ నుంచి ఓ స్పెషల్‌ అప్‌డేట్‌ని చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ఓ కీలక పాత్రను పరిచయం చేసింది. 'రాజమనార్‌'(Rajamanar‌)గా కీ రోల్‌లో కనిపించనున్న జగపతిబాబు(Jagapathibabu) లుక్‌ను విడుదల చేసింది. ఇందులో జగపతిబాబు ముక్కుకు రింగు, కోపం నిండిన చూపులతో ఫుల్‌ సీరియస్‌ లుక్‌లో దర్శనమిచ్చారు.

Also Read: Karthikeya Engagement: హీరో కార్తికేయకు నిశ్చితార్థం..నెట్టింట ఫోటో హల్ చల్!

భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో ప్రభాస్(Prabhas) వైల్డ్, సీరియస్ లుక్ లో కనిపించనున్నారు. ఈ సినిమాలో శ్రుతిహాసన్ (Sruthihasan) ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. శరవేగంగా ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. హంబులే ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మిస్తున్నారు. డైరెక్టర్ కేజీఎఫ్ (KGF Director) హీరోయిన్ శ్రీనిధి శెట్టితో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారని సమాచారం. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించేసింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News