No Free Tickets for Team RRR at Oscars: ఆస్కార్ అవార్డ్స్ షో టికెట్స్ కోసం రూ. 1.44 కోట్లు ఖర్చు ?

RRR Team Didn't Get Free Tickets For Oscars Show: ఆస్కార్ అవార్డ్స్ ప్రజెంటేషన్ షోను ప్రత్యక్షంగా వీక్షించడం కోసం రాజమౌళి కొనుగోలు చేసిన ఒక్కో టికెట్ విలువ 25,000 డాలర్లు అంట. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.20.6 లక్షలు అన్నమాట. అలా మొత్తం రూ.1 కోటి 44 లక్షల రూపాయలు వెచ్చించి ఈ టికెట్స్ సొంతం చేసుకున్నట్టు మీడియాలో వార్తలొస్తున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 19, 2023, 05:09 AM IST
No Free Tickets for Team RRR at Oscars: ఆస్కార్ అవార్డ్స్ షో టికెట్స్ కోసం రూ. 1.44 కోట్లు ఖర్చు ?

RRR Team Didn't Get Free Tickets For Oscars Show: ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలైనప్పటి నుండి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన రెస్పాన్స్ అందుకోవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ వంటి అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు నాటు పాటకు గాను ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. అయితే, ప్రతిష్టాత్మకమైన 95వ అకాడమీ అవార్డ్స్‌కు హాజరయ్యేందుకు రాజమౌళి మరియు అతని బృందానికి ఉచిత టిక్కెట్లు ఇవ్వలేదని మీకు తెలుసా?

న్యూస్ 18 ప్రచురించిన ఓ కథనం ప్రకారం, నాటు నాటుకు ట్యూన్ కంపోజ్ చేసిన ఎంఎం కీరవాణికి, ఆ గేయాన్నిరచించిన గీత రచయిత చంద్రబోస్ తో పాటు వాళ్లిద్దరి భార్యలకు మాత్రమే ఆస్కార్‌ అవార్డు ప్రదానోత్సవానికి ఉచిత ప్రవేశం లభించిందని.. మిగతా వాళ్లందరూ ఈ షోకు హాజరయ్యేందుకు టికెట్స్ కొనుగోలు చేశారని వార్తలొస్తున్నాయి. ఆస్కార్ నిర్వాహకుల నుంచి తమకు ఫ్రీ ఎంట్రీ పాసెస్ లభించకపోవడంతో రాజమౌళి తన కుటుంబంతో పాటు తాను తీసుకెళ్లిన మిగతా అందరి కోసం టిక్కెట్లు కొనుగోలు చేశారు అనేది ఆ వార్తా కథనం సారాంశం. 

ఆస్కార్ అవార్డ్స్ ప్రజెంటేషన్ షోను ప్రత్యక్షంగా వీక్షించడం కోసం రాజమౌళి కొనుగోలు చేసిన ఒక్కో టికెట్ విలువ 25,000 డాలర్లు అంట. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.20.6 లక్షలు అన్నమాట. అలా మొత్తం రూ.1 కోటి 44 లక్షల రూపాయలు వెచ్చించి ఈ టికెట్స్ సొంతం చేసుకున్నట్టు మీడియాలో వార్తలొస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై మూవీ యూనిట్ సభ్యులు స్పందిస్తేనే అసలు ఏం జరిగిందో తెలిసే అవకాశం ఉంటుంది.

ఎస్ఎస్ రాజమౌళితో పాటు ఆయన భార్య రమా రాజమౌళి, వారి కుమారుడు కార్తికేయ, కోడలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక ఆర్ఆర్ఆర్ మూవీలో ప్రధాన పాత్రలు పోషించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా సతీసమేతంగా ఈ గ్రాండ్ ఈవెంట్‌కి హాజరయ్యారు. 

ఆస్కార్ అవార్డ్స్ షో కోసం రాజమౌళి అండ్ టీమ్ టికెట్స్ కొనుగోలు చేయాల్సి వచ్చిందనే వార్త సంగతి అలా ఉంటే.. అంతకంటే ముందుగా ఈ ఈవెంట్ కి హాజరైన రాజమౌళి అండ్ టీమ్ కి చివరి వరుసలో సీట్లు కేటాయించి ఇండియన్ సినిమాను అవమానించారంటూ అవార్డ్స్ షో నిర్వాహకులపై విమర్శలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ దాదాపు షో ఎగ్జిట్‌కు సమీపంలో కూర్చున్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవడంతో నెటిజెన్స్ నుంచి అవార్డ్స్ షో నిర్వాహకులపై ఈ విమర్శలు వినిపించాయి. దీనికితోడు తాజాగా వారికి అసలు ఫ్రీ టికెట్స్ అందలేదన్న వార్త మీడియాలో దావానంలో వ్యాపిస్తోంది.

ఇది కూడా చదవండి : Allu Arjun Unblocked : ఇంతలోనే ఏం జరిగింది.. వెనక్కి తగ్గిన అల్లు అర్జున్.. భాను శ్రీ మెహతాకి విముక్తి

ఇది కూడా చదవండి : Tanish Look : చాలా రోజులకు ఇలా కనిపించిన తనీష్.. హీరో శ్రీరామ్‌ పిక్స్ వైరల్

ఇది కూడా చదవండి : Bandla Ganesh Trivikram : ఎవరా డాలర్ శేషాద్రి?.. త్రివిక్రమేనా?.. బండ్ల గణేష్ ట్వీట్ అర్థం ఏంటి?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News