Anasuya Bharadwaj: ఏపీ ఎన్నికలపై అనసూయ భరద్వాజ్‌ సంచలన వ్యాఖ్యలు.. త్వరలోనే ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం

Anasuya Bharadwaj Political Comments: రాజకీయాలపై యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏపీ ఎన్నికలపై స్పందిస్తూ ఓ పార్టీకి మద్దతుగా పని చేసేందుకు సిద్ధమని సంచలన ప్రకటన చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 31, 2024, 10:28 PM IST
Anasuya Bharadwaj: ఏపీ ఎన్నికలపై అనసూయ భరద్వాజ్‌ సంచలన వ్యాఖ్యలు.. త్వరలోనే ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం

Anasuya Bharadwaj: ఎన్నికల సమయంలో సినీ ప్రముఖులు తమ అదృష్టం పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో కొందరు నటీనటులు రాజకీయాల్లోకి అడుగుపెట్టగా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కూడా కొందరు సినీ ప్రముఖులు బరిలోకి దిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు హాట్‌హాట్‌గా ఉన్నాయి. దీనికి సినీ గ్లామర్‌ తోడయితే మరింత రసవత్తరంగా జరగనుంది. తాజాగా యాంకర్‌, నటి అనసూయ భరద్వాజ్‌ కూడా రాజకీయాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.

Also Read: Kodali Nani: జూన్‌ 4 తర్వాత ఏపీలో చంద్రబాబు కనిపించడు: కొడాలి నాని జోస్యం

 

ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో అనసూయ రాజకీయాలపై కూడా స్పందించారు. ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు. కానీ రాజకీయ పార్టీలు పిలిస్తే మాత్రం ప్రచారానికి వెళ్తాను. నాకు నాయకులే ముఖ్యం.. పార్టీలు కాదు' అని పేర్కొన్నారు. 'ఏ నాయకుడు నచ్చితే ఆ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి సిద్ధం. వాళ్ల అజెండాలు నచ్చితే మాత్రం కచ్చితంగా మద్దతు ఇస్తా' అని ప్రకటించారు.

Also Read: KTR Challenge: దమ్ముంటే రేవంత్‌ రెడ్డి రాజీనామా చేయాలి: కేటీఆర్‌ సంచలన సవాల్‌

 

అయితే రాజకీయాల్లో ప్రజలు తన మాట వింటారా అనే విషయమై స్పందిస్తూ.. 'రాజకీయాల్లోకి వచ్చినా నా మాట వినేవాళ్లు ఉండడం నా అదృష్టం. చెబితే వింటారు అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడకూడదు. బాధ్యతగా మాట్లాడాలి' అని రాజకీయ నాయకులకు హితవు పలికారు. ఇక పవన్‌కల్యాణ్‌ జనసేన పార్టీ విషయం మాట్లాడుతూ.. 'జనసేన లీడర్‌ నన్ను ప్రచారానికి పిలిస్తే వెళ్లడానికి నేను సిద్ధంగా ఉన్నా' అని అనసూయ భరద్వాజ్‌ తెలిపారు. బుల్లితెరకు దూరమైన అనసూయ ప్రస్తుతం సినిమాలపై పూర్తి దృష్టి సారించారు. ఇటీవల తెలంగాణ నేపథ్యంలో వచ్చిన 'రజాకార్‌' సినిమాలో నటించి అనసూయ హిట్‌ కొట్టారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News