Poonam Kaur gets emotional in Nathicharami Movie Press Meet: చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒకానొక సమయంలో సినిమాలు వదిలేసి.. పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్లిపోదామనుకున్నానని చెప్పారు. అమ్మ విషయంలో తనకు ఎక్కువగా బాధ ఉందని, ఏ తల్లైనా కూతురికి త్వరగా పెళ్లి అయితే సంతోషిస్తుందన్నారు. కొందరి కారణంగా ఎన్నో పెద్ద ప్రాజెక్టులను వదులుకున్నానని పూనమ్ తెలిపారు. తాను ప్రధానపాత్ర పోషించిన 'నాతిచరామి' సినిమా ప్రచారంలో భాగంగా పూనమ్ కౌర్ వ్యక్తిగత విషయాలు కూడా పంచుకున్నారు.
'దుర్భరమైన పరిస్థితిలో ఉన్న ఏ శ్రీ మీదైనా ఓ చిన్న కన్ను వేసినవాడు రాక్షసుడు అవుతాడు. కాలం ఏదైనా ఇదే జరుగుతుంది. 2017, 18లో నేను పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్లిపోదామనుకున్నా. కానీ నా జీవితాన్ని మార్చేసింది సినిమానే. తర్వాత సినిమాలు చేయను. పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్లిపోతానని మా అమ్మకు చెప్పాను. దేశం వదిలి వెళ్లిపోతానని చెప్పా. కానీ చాలా క్లిష్టతరమైన పరిస్థితిలో రియలైజ్ అయ్యాను. దానివల్లే ఏ రోజు ఇక్కడ ఉన్నాను. ప్రతిరోజూ సీత, దుర్గా, ద్రౌపదిలానే తలచుకునేదాన్ని. అందువల్లే చాలా శక్తిని, ధైర్యాన్ని పొందాను' అని పూనమ్ కౌర్ చెప్పారు.
'మధ్య తరగతి అమ్మాయిలకు చాలా కలలు ఉంటాయి. అందులో ప్రత్యేకమైనది పెళ్లి. ఆ పెళ్లి కలను కొందరు చెదరగొట్టారు. అయితే ఇండియన్ కల్చర్‌లోనే మహిళలు ఎలా ధైర్యంగా ఉండాలనేది, పోరాడలనేది ఉంది. దాని నుంచే నేను స్ఫూర్తి పొందాను. ఈ విషయంలో అమ్మ ఎంతో సపోర్ట్ చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా అమ్మకు శుభాకాంక్షలు. ఆ సమయంలోనే ఉమెన్ సెంట్రిక్ సినిమా ఉందని నా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పింది. నేరుగా చెన్నై వచ్చి కలిసింది. ఇది నిజజీవిత సంఘటనల ఆధారంగా, భార్య గురించి చెప్పే కథ అని తెలిసి ఒప్పుకున్నా. సినిమాలోని శ్రీలత పాత్ర నా జీవితానికి చాలా దగ్గరగా ఉంది. మూడేళ్ల క్రితం నా ఆలోచనలు 18 ఏళ్ల అమ్మాయిలా ఉండేవి. ఇప్పుడు మాత్రం 50 ఏళ్ల మహిళగా ఉన్నాయి' అని పూనమ్ పేర్కొన్నారు.
'చాలా మందికి నా గురించి తెలియదు. ఐఏఎస్, ఐపీఎస్, లాయర్ ఇందులో ఎదో ఒకటి అవ్వాలనేది నా కల. ఆ కల నెరవేర్చుకునేందుకు కావాల్సిన డబ్బు కోసమే సినీ పరిశ్రమలోకి వచ్చా. కొందరి కారణంగా ఎన్నో పెద్ద ప్రాజెక్టులను వదులుకున్నా. నేను ఓ సినిమా అవకాశం కోసం ప్రముఖుల దగ్గరకు వెళ్లానని.. వారు నాపై కోప్పడ్డారని వార్తలు వచ్చాయి. అందులో ఎంతమాత్రం నిజం లేదు. మరొకరిని టార్గెట్ చేసే క్రమంలో నన్ను ఓ ఆయుధంగా వాడారు' అని పూనమ్ తెలిపారు. నాగు గవర దర్శకత్వంలో పూనమ్, అరవింద్ కృష్ణ, సందేష్ బురి ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'నాతి చరామి' సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో మార్చి 10న విడుదల కానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook