Vishal MGR Tattoo : గుండెపై సీఎం బొమ్మ.. టాటూని చూపించిన విశాల్.. పొలిటికల్ ఎంట్రీనా?

Hero Vishal MGR Tattoo హీరో విశాల్ తాజాగా అందరినీ ఆశ్చర్యపరిచాడు. విశాల్ తన చాతి మీద ఎంజీఆర్ బొమ్మను పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడు. షర్ట్ లేకుండా కనిపించి ఇలా తన టాటూని చూపించాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2023, 07:49 PM IST
  • నెట్టింట్లో విశాల్ సందడి
  • ఎంజీఆర్ టాటూ హైలెట్
  • పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాడా?
Vishal MGR Tattoo : గుండెపై సీఎం బొమ్మ.. టాటూని చూపించిన విశాల్.. పొలిటికల్ ఎంట్రీనా?

Hero Vishal MGR Tattoo కోలీవుడ్, టాలీవుడ్‌లో హీరో విశాల్‌కు సరిసమానమైన క్రేజ్ ఉంది. అయితే ఇప్పుడు విశాల్ రాజకీయ ఎంట్రీ మీద చర్చలు నడుస్తున్నాయి. విశాల్ తన చాతి మీద ఎంజీఆర్ బొమ్మను టాటూగా వేయించుకున్నాడు. దీంతో ఆయన పొలిటికల్ ఎంట్రీ మీద చర్చలు మొదలయ్యాయి. అయితే ఇదేమైనా సినిమా కోసం అయి ఉంటుంది అని జనాలు చెప్పుకుంటున్నారు. మరి వీటిలో ఏది నిజమో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

అయితే పొలిటికల్‌ మీద విశాల్ స్పందించేందుకు ఏ మాత్రం వెనకాడడు. ఆ మధ్య లాఠీ సినిమా ప్రమోషన్స్ విషయంలో తెలుగు రాష్ట్రాల రాజకీయాల మీద స్పందించాడు.కుప్పంలో చంద్రబాబుకు పోటీగా విశాల్ పోటి చేస్తాడని ప్రచారం జరిగింది. అయితే దీనిపై విశాల్ స్పందించాడు. అవన్నీ పుకార్లేనని కొట్టి పారేశాడు.

తనకు జగన్ అంటే ఇష్టమని, సినిమాల పరంగా పవన్ కళ్యాణ్‌ అంటే ఇష్టమని, అయితే ఓటు వేయాల్సి వస్తే మాత్రం జగన్‌కే వేస్తాను అంటూ నిర్మొహమాటంగా తన నిర్ణయాన్ని, అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఇక తమిళ నాట సైతం విశాల్ పొలిటికల్ హీట్ పెంచేలా కనిపిస్తున్నాడు.

ఈ ఎంజీఆర్ బొమ్మ అనేది సినిమా కోసం వేసుకుందా? లేదంటే నిజంగానే వేసుకున్నాడా? పొలిటికల్ ఎంట్రీదా? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. విశాల్ లాఠీ, ఎనిమి, చక్ర సినిమాలు ఇలా అన్నీ కూడా ఫ్లాపులుగా మిగిలాయి.

Also Read:  Rajamouli murder Plan : రాజమౌళి హత్యకు కుట్ర.. హెచ్చరించిన రామ్ గోపాల్ వర్మ

Also Read: Thaman Trolls : ఇక్కడ శివుడంటాడు.. అక్కడ చచ్చినా పర్లేదంటాడు.. తమన్ అతి డైలాగులపై సెటైర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News