Prabhas: మీ ప్రేమకు.. థ్యాంకూ డార్లింగ్స్

టాలీవుడ్ హీరో ప్రభాస్ బాహుబలి ( Baahubali ) చిత్రంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సూపర్ డూపర్ స్టార్డమ్‌ను సంపాందించుకున్నాడు. ఇప్పుడు ప్రక్షకుల్లో ప్రభాస్ (Prabhas) క్రేజే వేరు.

Last Updated : Oct 2, 2020, 03:50 PM IST
Prabhas: మీ ప్రేమకు.. థ్యాంకూ డార్లింగ్స్

Prabhas reacts to the increase followers: టాలీవుడ్ హీరో ప్రభాస్ బాహుబలి ( Baahubali ) చిత్రంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సూపర్ డూపర్ స్టార్డమ్‌ను సంపాందించుకున్నాడు. ఇప్పుడు ప్రేక్షకుల్లో ప్రభాస్ (Prabhas) క్రేజే వేరు. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారిన అనంతరం సాహో (saho) సినిమాలో అలరించాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఎక్కువగా అలరించకపోయినప్పటికీ.. ప్రభాస్ స్టార్‌డమ్ క్రేజ్ బాలీవుడ్ (Bollywood)  హీరోలకంటే ఎక్కువగానే ఉంది. అయితే ఈ మిర్చి కుర్రాడు చాలా రేర్‌గా సోషల్ మీడియా (social media) లో కనిపిస్తుంటాడు. ఆయన ఏ పోస్ట్ షేర్ చేసినా.. బీభత్సమైన రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. అయితే  ఇటీవలనే హీరో ప్రభాస్ ఫేస్‌బుక్ ఫాలోవర్ల సంఖ్య 20 మిలియన్లు దాటింది. అయితే తన ఫేస్‌బుక్ ఫాలోవర్ల సంఖ్య 20 మిలయన్లు  దాటడంపై ప్రభాస్ స్పందించాడు. 20 మిలియన్ల మీ ప్రేమకు థ్యాంకూ డార్లింగ్స్ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు. ఇంకేముంది ప్రభాస్ పోస్ట్‌కి లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్లు వస్తున్నాయి. ఏదీ ఏమైనప్పటికీ టాలీవుడ్‌లో ప్రభాస్ రూటే సపరేటు అంటూ మరోసారి నిరూపించుకున్నాడు.

https://www.facebook.com/ActorPrabhas/posts/2082019555262241

ఇదిలాఉంటే.. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ (Radhe Shyam) సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ తాజాగా ఇటలీలో ప్రారంభమైంది. దీంతోపాటు ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రం, అదేవిధంగా ఓం రౌత్ డైరెక్షన్లో భారీ చిత్రం ఆదిపురుష్ ( Adipurush ) చేయనున్నాడు. అయితే ప్రభాస్ క్రేజ్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెరగడంతో.. దర్శక నిర్మాతలు ఆయనతో సినిమాలు తీసేందుకు ఇష్టపడుతున్నారు. Also read: Anurag Kashyap అబద్ధాలు చెబుతున్నాడు.. లై డిటెక్టర్ టెస్టులు చేయండి: Payal Ghosh

Trending News